ఉత్తరకొరియా అధ్యక్షుడు అంటే ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని ప్రతి దేశంలో ఆయనకు ఓ గుర్తింపు ఉంది. అయితే ఆ గుర్తింపు మాత్రం కిమ్ ఓ రాక్షసుడు మూర్ఖుడని మాత్రమే. దానికి కారణం కిమ్ వేసే శిక్షలు మరియు ఆయన తీసుకునే నిర్ణయాలే. ముఖ్యంగా ఉత్తర కొరియాలో ఆయన విధించే శిక్షలతోనే కిమ్ ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకున్నారు. కరోనా వేళ వేరే దేశం వెళ్లివచ్చారని ఓ ఇద్దరిని కాల్చి చంపారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
అంతే కాకుండా అగ్రదేశం అమెరికాకే కిమ్ చెమటలు పట్టించారు. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఉన్న సమయంతో ఇద్దరూ ఒకరికి ఒకరు వార్నింగ్ లు ఇచ్చుకున్నారు. అమెరికా అగ్రదేశమైనప్పటికీ కిమ్ తగ్గకుండా అను బాంబుల తయారీపై దృష్టిపెట్టాడు. దాంతో మూడో ప్రపంచ యుద్దం వస్తుందన్న వాతావారణం కూడా కనిపించింది. అయితే కిమ్ తాజాగా ఇద్దరు కూలీలకు వేసిన శిక్ష ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. కిమ్ తన తండ్రి జోంగ్ ఇల్ సమాధి పక్కన పూల మొక్కలను నాటించారట.
అయితే ఆ పూల మొక్కలకు ప్రతి ఏడాది పూలుస్తాయి. ఆ పూలు పూసేలా చెట్లు వాడిపోకుండా ఉండేందుకు కిమ్ ఇద్దరు కూలీలను కూడా నియమించారట. కానీ ఈ యేడాది వాతావరణంలో మార్పుల వల్ల ఆ పూలు పూయలేదు. దాంతో కిమ్ ఆ ఇద్దరు కూలీలకు ఆరు నెలల పాటూ జైలు శిక్ష విధించాడట. ఇక ఈ వార్త తెలిసినవాళ్లు చెట్లకు పూలు పూయకపోతే వాళ్లేం చేస్తారురా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.