Telugu News » న‌వ్వ‌డం పై నిషేదం.. ఎక్క‌డో తెలుసా..?

న‌వ్వ‌డం పై నిషేదం.. ఎక్క‌డో తెలుసా..?

by Bunty

నవ్వుపై అనేక అభిప్రాయాలు ఉంటాయి. నవ్వని వాడు మనిషే కాదు అని ఎందరో అంటే.. నవ్వు నాలుగు విధాలుగా చేటు అనే వారు కూడా లేకపోలేదు. అయితే ఆ నవ్వు గోల ఎలా ఉన్నా సంచలన నిర్ణయాలకు వేదికైన ఉత్తర కొరియా తాజాగా షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న‌ది. ఆ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో నవ్వడం నిషేధం విధించింది. ఇవాళ నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. కేవలం నవ్వడంపై మాత్రమే కాదు మద్యం సేవించడం, సరుకులు కొనేందుకు షాపింగ్‌కు వెళ్లడం, విశ్రాంతి కార్యక్రమాల్లో పాల్గొనడంపై కూడా అధికారులు నిషేధం విధించారు.

Ads

 

ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి. ఇవి ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏ కారణం లేకుండా ఎవ‌రూ కూడా నిర్ణయం తీసుకోరు. ముఖ్యంగా ఆదేశ మాజీ దేశాధ్య‌క్షుడు కిమ్ జాంగ్‌ II ఆయ‌న భౌతికంగా దూరంగా ప‌దేండ్లు గ‌డించింది. ఆయ‌న ప‌దో వ‌ర్థంతి సంద‌ర్భంగా 10 రోజుల పాటు న‌వ్వ‌కుండా ఉత్త‌ర కొరియా అధికారులు నిషేదం విధించారు.

 

గతంలో, సంతాప సమయంలో మద్యం సేవించి లేదా మత్తులో పట్టుబడిన చాలా మందిని అరెస్టు చేసి సైద్ధాంతిక నేరస్తులుగా పరిగణించిన సందర్భాలు ఉన్నాయి. ఈ సంతాప సమయంలో, అంత్యక్రియల ఆచారాలు లేదా సేవలు లేదా పుట్టినరోజులను జరుపుకోవడానికి కూడా ఎవరికి అనుమతించరు. మరొక‌వైపు కిమ్ జోంగ్ II వర్ధంతి సందర్భంగా ఉత్తర కొరియా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్లాన్‌ చేసింది. ఆ నేత ఫోటోగ్రఫీ కళ బహిరంగ ప్రదర్శన, కచేరీ, ఆయన పేరు పెట్టబడిన ‘కిమ్‌జోంగిలియా’ అనే పుష్పం ప్రదర్శన కూడా ఉన్నాయి.


You may also like