బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా చిక్కుల్లో పడ్డారు. మోసం కేసులో సోనాక్షి సిన్హాకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేశారు. యూపీలోని మోరాబాద్ పట్టణం కట్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈవెంట్ నిర్వహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హా పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఓ కార్యక్రమానికి ప్రమోద్ శర్మ సోనాక్షిసిన్హాను ఆహ్వానించారు. అంతే కాకుండా సోనాక్షికి కార్యక్రమానికి వచ్చేందుకు రూ.37లక్షలను అందించారు.
Advertisement
Advertisement
కానీ సోనాక్షి సిన్హా ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. కానీ సోనాక్షికి చెల్లించిన డబ్బులను తిరిగి ఇచ్చేందుకు ఆమె మేనేజర్ నిరాకరించాడు. సోనాక్షి సిన్హాను స్వయంగా కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాంతో ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాపై పోలీసు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ సోనాక్షి విచారణకు హాజరుకాలేదు. దాంతో కోర్టు ఏకండా సోనాక్షి సిన్హాకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.