ఆసియా కప్ 2023 టోర్నమెంట్ గెలిచిన ఉత్సాహంలో టీమిండియా ఉంది. ఇక మరో 15 రోజుల్లోనే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ కూడా ప్రారంభం కానుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. మన ఇండియాలో ఈ ప్రపంచకప్ జరుగుతుందటంతో… బిసిసిఐ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఉప్పల్ స్టేడియంలో ఈనెల 29 న పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులకు అనుమతి లేదని ప్రకటన చేసింది HCA. సెప్టెంబర్ 28వ తేదీన హైదరాబాద్ మహానగరం తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం జరగనుంది. అలాగే మిలాద్ ఉన్ నబీ పండుగ కూడా ఉంది.
Advertisement
Advertisement
దీంతో హైదరాబాద్ పోలీసులు ఫుల్ బిజీ కానున్నారు. ఈ తరుణంలోనే ఉప్పల్ స్టేడియం వద్ద భద్రత ఇవ్వలేమని పోలీసులు చేతులెత్తేశారు. పోలీసులు ఈ ప్రకటన చేయడంతో ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులకు అనుమతి లేదని HCA తాజాగా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య కేవలం ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
- చంద్రబాబు అరెస్టుపై స్పందించిన హీరో విశాల్…జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు !
- Asia Cup 2023 : ఆసియా కప్పు తీసుకొచ్చి ఇతని చేతుల్లో పెట్టారు! ఎవరితను?
- బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన వసీం అక్రమ్ ! ఇది సరైనదే అంటారా ?