ఐపీఎల్ లో ఇప్పటివరకు టైటిల్ సాధించని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఒక్కటి. ఎప్పుడు బ్యాటింగ్ లో చాలా బలంగా కనిపించే ఈ జట్టు బౌలింగ్ లో తేలిపోతుంది. 200లకు పైగా పరుగులు చేసి కూడా వాటిని కాపాడుకోలేక ఆర్సీబీ ఓడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ జట్టు టైటిల్ కొట్టకపోయిన… ఐపీఎల్ లో ఉన్న అన్ని జట్ల కంటే ఈ జట్టుకే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. ఇక మ్యాచ్ చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ తమ అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తారు.
Advertisement
కానీ తాజాగా ఓ మహిళా చేసిన పని తెగ వైరల్ గా మారింది. ఆర్సీబీ చెన్నైకి మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ మహిళ… తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఐపీఎల్ టైటిల్ సాధించేవరకు పెళ్లి చేసుకోను అని ప్లకార్డును పట్టుకుంది. ఇక మ్యాచ్ లో క్యాచ్ ల కంటే.. ఇలాంటివి ఎక్కడున్నా బాగా పసిగట్టే మన ఐపీఎల్ కెమెరామెన్లు.. ఈ అమ్మాయిని ప్లకార్డును స్క్రీన్ పైన చూపించడంతో.. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
Advertisement
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే భారత బౌలర్ అమిత్ మిశ్రా ఈ విషయం పై స్పందించాడు. ఆ అమ్మ ప్లకార్డును పట్టుకున్న ఫోటోను సొసైల్ మీడియాలో షేర్ చేసి.. ఇప్పుడు ఈ అమ్మాయి తలిదండ్రులు బాగా ఆందోళన చెందుతూ ఉంటారు అని రాసుకొచ్చాడు. అంటే ఆర్సీబీ జట్టు టైటిల్ గెలవడం ఎంత కష్టమో.. మిశ్రా చెప్పకనే చెప్పేసాడు.
ఇవి కూడా చదవండి :
ఐపీఎల్లో టాప్ 5 రిచెస్ట్ టీమ్ ఓనర్లు వీరే..!
ధోని ముందే హెలికాప్టర్ షాట్ ఆడిన సిరాజ్..!