Home » బాలయ్యకు బిగ్‌ షాక్‌..అన్నపూర్ణ స్టూడియోస్ లోకి నో ఎంట్రీ….!

బాలయ్యకు బిగ్‌ షాక్‌..అన్నపూర్ణ స్టూడియోస్ లోకి నో ఎంట్రీ….!

by Bunty
Ad

రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ సభలో సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ స్పీచ్ లో మాట్లాడుతూ షూటింగ్ లో నాన్నగారు, ఆ రంగారావు, ఈ రంగారావు, అక్కినేని, తొక్కినేని ఇవే మాట్లాడుకునే వాళ్ళం అంటూ వ్యాఖ్యానించారు. కాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. బాలయ్య చేసిన కామెంట్లపై ఇప్పటికే అక్కినేని వారసుడు నాగచైతన్య స్పందిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

READ ALSO : Pathaan Movie Review : “పఠాన్” మూవీ రివ్యూ

Advertisement

అటు తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగి బాలయ్య పై విరుచుకుపడుతున్నారు. వెంటనే బాలయ్య క్షమాపణలు చెప్పాలంటున్నారు. ఇక తాజాగా ఈ వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అదేమిటంటే నందమూరి బాలకృష్ణని అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం లోపలికి అనుమతించడం లేదు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే ఒక టాక్ షో చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సెకండ్ సీజన్ దాదాపు పూర్తి కావచ్చింది.

Advertisement

అయితే రేపు ఒక ఎపిసోడ్ షూటింగ్ ఉందని, ఆ షూటింగ్ నిమిత్తం నందమూరి బాలకృష్ణ రేపు రావాల్సి ఉండగా మేము బాలకృష్ణను లోపలికి రానివ్వం అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ఆహా టీం కి ఒక మెసేజ్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్త అయితే నిజం కాదని తెలుస్తోంది. ఎందుకంటే అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ టు పదవ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ గెస్ట్ తో టెలికాస్ట్ అవుతుంది. మూడో సీజన్ ప్రారంభించడానికి కాస్త సమయం పడుతుంది. ఇప్పట్లో బాలకృష్ణ ఆహా షూట్ కోసం అయితే అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇది ఎవరో సృష్టించిన వార్త అని తెలుస్తోంది.

READ ALSO : Venkatesh 75 : వెంకటేష్‌ ఫస్ట్ పాన్‌ ఇండియా మూవీ! అదిరిపోయిన ‘సైంధవ్‌’ గ్లింప్స్!

Visitors Are Also Reading