మరో 10 రోజుల్లో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు తమ జట్ల సభ్యులను ఇప్పటికే ప్రకటించాయి. నిన్న పాకిస్తాన్ కూడా తమ టీం సభ్యులను ప్రకటించేసింది. పది రోజుల కిందటే టీమిండియా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ పాలకమండలి.
అయితే ఈ 15 మంది సభ్యులలో చాలామందికి మొండి చేయి చూపించింది బీసీసీఐ. సంజు శాంసన్, తిలక్ వర్మ, ధావన్ మరియు అశ్విన్ అలాగే చాహల్ లాంటి కీలక ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వకుండా… కొత్త ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ పాలకమండలి. ఇందులో ముఖ్యంగా చాహల్ కు వరల్డ్ కప్ జట్టులో స్థానం కల్పించకపోవడంతో అందరూ షాక్ నకు గురయ్యారు. చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను ఫైనల్ చేశారు.
Advertisement
Advertisement
విదేశాల్లో చాలా రికార్డు పెద్దగా లేకపోయినా… స్వదేశంలో చాహల్ చరిత్ర సృష్టించగలడు. కానీ అతన్ని సెలెక్ట్ చేయకుండా కుల్దీప్ యాదవ్‌ను సెలెక్ట్ చేశారు. అలాగే మొన్నటి వరకు టీమిండియా జట్టులో అందరితో సాదాసీదాగా… జోకులు చేసుకుంటూ అందరివాడేలా ఉండేవాడు చాహల్. కానీ ఇప్పుడు జట్టులో సెలెక్ట్ కాకపోవడంతో… అందరూ చాహల్ ను మిస్ అవుతున్నారు. ప్రపంచ కప్ జట్టుకు సెలెక్ట్ చేయకపోవడమే కాకుండా… మొన్న జరిగిన ఆసియా కప్ 2023, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కు కూడా చాహాల్ ను సెలెక్ట్ చేయలేదు. దీంతో ఇండియా ను వదిలేసి…విదేశాలలో చాహాల్ ఆడాలని అతని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
- సంజూను మర్చిపోవాల్సిందే..!సూర్యపై నమ్మకం ఉంది – ద్రవిడ్ సంచలనం
- World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ విజేతకు రూ. 33 కోట్లు..ఆ ట్రోఫీ ధర ఎంతో తెలుసా..?
- యాంకర్ ఝాన్సీ భర్త రెండో పెళ్లి ..అసలు కారణం ఏంటీ?