తెలుగు ఇండస్ట్రీ లో టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్ లలో నిత్యామీనన్ ఒకరు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లలో చాలామంది పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కూడా కంటున్నారు. కొంత మంది హీరోయిన్లకు మూడు పదుల వయసు దాటినా పెళ్లి ఊసు ఎత్తడం లేదు. ఈ తరుణంలోనే స్టార్ నటి నిత్యామీనన్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. మరి అవేంటో ఒక సారి చూద్దాం.. మలయాళ నటిగా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి తమిళ మరియు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు నిత్యామీనన్.
Advertisement
భీమ్లా నాయక్ సినిమాతో మరో హిట్ అందుకొని దూసుకుపోతోంది ఈ కథానాయిక.. ఈమె సింగిల్ కాంపిటీషన్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా కూడా పని చేస్తోంది.. ఈ విధంగా ఉండగానే ఈమె వివాహానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. అదేంటయ్యా అంటే నిత్యా మీనన్ త్వరలో ఓ ఇంటిది అవుతోందని, ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు మలయాళ నటుడితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది.
Advertisement
అది కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరూ ఒకర్నొకరు ఇష్టపడి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈమె ప్రేమ గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. ఆమె మలయాళ నటుడుతో లవ్ లో ఉందని ఆయన కూడా తెలుగు ప్రేక్షకులకు చాలా తెలిసిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు నిజముందో, అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది.
ALSO READ:
- దినేష్ కార్తీక్: భార్య, ప్రాణస్నేహితుడు కలిసి మోసం చేస్తే.. అవమానం తట్టుకొని పడిలేచిన కెరటం కార్తీక్.. చివరికి..?
- చనిపోయిన వారి ఐడీ కార్డులు మీ దగ్గర ఉంటే వెంటనే ఇలా చేయండి.. లేదంటే నష్టమే..!!