Home » నిర్మలమ్మ వల్లే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్ లకు స్టార్ డమ్ వచ్చిందని తెలుసా..? ఎలా అంటే..?

నిర్మలమ్మ వల్లే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్ లకు స్టార్ డమ్ వచ్చిందని తెలుసా..? ఎలా అంటే..?

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి కాలంలో ఎన్నో సినిమాల్లో ఎంతోమంది హీరోలకు… హీరోయిన్లకు… అమ్మ పాత్రల్లో నానమ్మ… అమ్మమ్మ పాత్రలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నిర్మలమ్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్గా ఎదగవలసిన నిర్మలమ్మ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎందుకు మిగిలిపోయిందా అనే విషయాలను తెలుసుకుందాం.

Advertisement

సీనియర్ నటి నిర్మలమ్మకు మొదటి నుండి నాటకాలు వేసే అలవాటు ఉంది. ఆమెకు నాటకాల ద్వారా మంచి గుర్తింపు ఆ సమయంలో వచ్చింది. పదవ తరగతి చదువుతూనే నాటకాల్లో పాల్గొనేదట. కాకపోతే ఈమెకు ఇంటి నుండి పెద్దగా సపోర్ట్ లేదట. ఈమె పెదనాన్న కూడా నాటకాలు వేయడంతో ఈనటికి అతని ద్వారా కొంచెం సపోర్ట్ ఉండేదట. చాలామంది నువ్వు అందంగా ఉంటావు… బాగా నటిస్తావు అని చెప్పడంతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలి అనే కోరిక వచ్చిందట. దానితో చదువును కూడా మధ్యలో ఆపేసిందట. కానీ సినిమా రంగంలోకి ఎలా ఎంట్రీ ఇవ్వాలా అనే విషయం మాత్రం ఈమెకు పెద్దగా తెలియదట.

Advertisement

అలా సినిమాల అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓసారి దర్శకుడు బలరామయ్య గరుడ గర్వభంగ అనే మూవీ కోసం విజయవాడ వచ్చి నిర్మలమ్మ వేసిన నాటకం చూశారట. ఆ నాటకంలో ఈనాటి నటించిన తీరు ఈ దర్శకుడికి అద్భుతంగా నచ్చడంతో ఆయన తను దర్శకత్వం వహించిన సినిమాలో ఆ పాత్ర ఇచ్చారు. ఈమె నటించిన మొదటి సినిమా 1973 లో కాగా… ఆ తర్వాత 1944 పాదుకా పట్టాభిషేకం అనే రెండవ సినిమా విడుదల అయింది. కానీ ఈమె నటించిన రెండవ సినిమాలో ఆమె పాత్ర మూవీలో లేకపోవడంతో చాలా బాధపడి ఇక సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యి పూర్తిగా తన ఇంట్రెస్ట్ ను నాటకాలపై పెట్టింది.

అలా నాటకాలపై ఈ నటి ఇంట్రెస్ట్ చూపుతున్న సమయంలో 1954లో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు… అక్కినేని నాగేశ్వరరావు తో తీస్తున్న ఆడ పెత్తనం అనే సినిమాలో హీరోయిన్‌గా ఈ నటిని అడిగారు. కానీ రెండవ సినిమా విషయంలో జరిగిన అవమానం గుర్తుపెట్టుకొని ఆ హీరోయిన్ పాత్రను ఈ నటి రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆ సినిమాలో హీరోయిన్ అవకాశం అంజలీదేవికి దక్కింది. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో అంజలీదేవి స్టార్ హీరోయిన్ అయ్యారు. అలా ఆ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటి మళ్ళీ సినిమాలు చేయాలని నిర్ణయించుకొని వెళితే అక్క, వదిన, అమ్మ పాత్రలు వచ్చాయి. ఆ విధంగా స్టార్ హీరోయిన్ కావాల్సిన నిర్మలమ్మ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయింది.

Visitors Are Also Reading