నాటక రంగం నుండి సినిమాల్లోకి వచ్చిన వారిలో నిర్మలమ్మ కూడా ఒకరు. నిర్మలమ్మ మొదట హీరోయిన్ గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగింది. సినిమాల్లో సైడ్ పాత్రలు చేసినప్పటికీ నిర్మలమ్మ హీరోయిన్ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ నుండి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వరకూ పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నిర్మలమ్మ ముఖ్యమైన పాత్రలలో నటించింది.
తెలుగులో దాదాపు 1000 కి పైగా సినిమాల్లో నటించి తన నటనతో అభిమానులను సంపాదించుకుంది. అయితే నిర్మలమ్మ సినిమా జీవితం గురించి చాలామందికి తెలుసు కానీ ఆమె పర్సనల్ లైఫ్ గురించి అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. నిర్మలమ్మ ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణారావును ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి పిల్లలు పుట్టలేదు.
Advertisement
Advertisement
దాంతో కొంతకాలం నిర్మలమ్మ దంపతులు డిప్రెషన్ లోకి వెళ్లారు. కానీ ఆ తర్వాత నిర్మలమ్మ కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. ఆమె పెళ్లిని నిర్మలమ్మ దంపతులు దగ్గరుండి జరిపించారు. కాగా ఆమెకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఆ కుమారుడి పేరు విజయ్ మాదాల.
నిర్మలమ్మ వారసుడిగా విజయ్ మాదాల పడమట సంధ్యారాగం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే విజయ్ పుట్టినప్పటి నుండి అమెరికాలో ఉండటం వల్ల తెలుగు సరిగ్గా మాట్లాడటం రాక ఇబ్బంది పడ్డాడు. దాంతో టాలీవుడ్ లో విజయ మాదాల రాణించలేకపోయాడు.