Home » నింద సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

నింద సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

by Sravanthi
Ad

నింద సినిమాకు రాజేష్ జగన్నాధం దర్శకత్వం వహించారు. నిర్మాతగా కూడా వ్యవహరించారు. వరుణ్ సందేశ్, తనికెళ్ళ భరణి, అన్నీ, భద్రం, సూర్య కుమార్, ఛత్రపతి శేఖర్, మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై తదితరులు నటించారు. సంతు ఓంకార్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించారు. ఇక కథ, రివ్యూ లోకి వెళ్ళిపోదాం.

nindha-movie-reveiw

Advertisement

సినిమా: నింద
నటీ నటులు: వరుణ్ సందేశ్, తనికెళ్ళ భరణి, అన్నీ, భద్రం, సూర్య కుమార్, ఛత్రపతి శేఖర్, మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై తదితరులు
దర్శకుడు: రాజేష్ జగన్నాధం
నిర్మాత: రాజేష్ జగన్నాధం
సంగీతం: సంతు ఓంకార్
రిలీజ్ డేట్: 21-06-2024

కథ మరియు వివరణ:

ఇక స్టోరీ ఏంటో చూస్తే.. ఒక ఊరిలో అమ్మాయి రే*ప్ కి గురై చనిపోతుంది. అమ్మాయిని ఎవరు చంపారు అనే విషయంపై ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ అమ్మాయిని ఒకరు చంపితే ఇంకొకరిని పోలీసులు జైలుకు పంపిస్తారు. ఇది ఎందుకు జరిగింది..? ఆ అమ్మాయిని చంపిన అసలు నేరస్థులు ఎవరు..? దీని అంతటికీ కారణం ఎవరు అనేది తెలియాలంటే మూవీ చూడాలి. దర్శకుడు రాజేష్ జగన్నాథం తీసుకున్న పాయింట్ బాగుంది ఈ సినిమాని మొదట నుండి కూడా తను ఎంగేజింగ్ గా తీసుకు వెళ్లారు. అయితే అక్కడక్కడా కొద్దిగా తడబడ్డాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్ట్ ఫాస్ట్ గా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం బాగుంది.

Advertisement

 

అలాగే సస్పెన్స్ ఎలిమెంట్స్ మాత్రం చాలా బాగా రాసారు. కొన్ని ట్విస్టులు సూపర్బ్ గా వున్నాయి. ఆ వ్యక్తిని ఎవరు మర్డర్ చేసారు అనే ఒక అంశం మీద చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లి చివర్లో రివిల్ చేయడం కూడా సూపర్బ్ గా వుంది. మొత్తానికి ఈ సినిమాని దర్శకుడు నడిపించిన విధానం హైలెట్ వుంది, స్క్రీన్ ప్లే అయితే సినిమాని ముందుకు తీసుకువెళ్లడంలో చాలా హెల్ప్ చేసింది. వరుణ్ సందేశం ఎంట్రీ అప్పటినుండి సినిమా ఫాస్ట్ గా వెళ్తుంది. నటలు కూడా బానే వాళ్ళ పాత్రలకు తగ్గట్టు న్యాయం చేశారు. వరుణ్ సందేశ్ కూడా చాలా అద్భుతంగా నటించారు. సంతు ఓంకార్ మ్యూజిక్ మూవీకి మైనస్ అయ్యింది. అలానే సస్పెన్స్ ఎలిమెంట్స్ ని హైలైట్ చేయడానికి ఇచ్చిన మ్యూజిక్ కూడా డల్ అయింది అని చెప్పొచ్చు.

Also read:

ప్లస్ పాయింట్స్:

వరుణ్ సందేశ్ నటన
స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్:

సాధారణ కథ
మ్యూజిక్

రేటింగ్: 2.5/5

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading