Home » అట్టర్ ప్లాప్ టాక్ వచ్చిన నిజం ఎంత వసూలు చేసిందో తెలుసా..? ఎంతో తెలిస్తే అస్సలు నమ్మలేరు..!

అట్టర్ ప్లాప్ టాక్ వచ్చిన నిజం ఎంత వసూలు చేసిందో తెలుసా..? ఎంతో తెలిస్తే అస్సలు నమ్మలేరు..!

by AJAY
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలలో నటించాడు. అలాగే పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీలో కూడా నటించి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇంతటి రేంజ్ విజాయలను అందుకున్న మహేష్ తన కెరియర్లో కొన్ని ఫ్లాప్ మూవీలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

Advertisement

అలా మహేష్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన మూవీలలో నిజం సినిమా ఒకటి. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న తేజ ఈ మూవీకి దర్శకత్వం వహించగా… రక్షిత ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్గా నటించింది. గోపీచంద్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు.

Advertisement

ఒక్కడు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత మహేష్ నటించిన మూవీ కావడం చిత్రం… జయం… నువ్వు నేను లాంటి వరుస విజయాల తర్వాత తేజ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ “నిజం” మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా తేజ మాట్లాడుతూ… ఒక్కడు మూవీ తర్వాత నిజం సినిమా విడుదల కావడం వల్ల ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. అదే ఒక్కడు మూవీ కంటే ముందు కనుక నిజం సినిమా విడుదల అయి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ అయ్యేది. అయినప్పటికీ నిజం కమర్షియల్ గా అంతా ఫ్లాప్ సినిమా ఏమీ కాదు. ఈ సినిమాకు ఆ సమయంలోనే 10 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు వచ్చాయి అని తేజ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading