Home » తిక్క ప్రశ్న వేసిన నెటిజన్….దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన మెగాడాటర్…!

తిక్క ప్రశ్న వేసిన నెటిజన్….దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన మెగాడాటర్…!

by AJAY
Ad

మెగా డాటర్ నిహారిక కొణిదెల అంటే ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక నటి గా మారి హీరోయిన్ వరకు ఎదిగింది. కానీ హీరోయిన్ గా నిహారిక సక్సెస్ కాలేకపోయింది. రెండు మూడు. సినిమాలు చేసి గుడ్ బై చెప్పేసింది. మరోవైపు వెబ్ సిరీస్ ల నిర్మాతగా కూడా నిహారిక కు మంచి క్రేజ్ వచ్చింది. ఇక సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే నిహారిక చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

niharika konidela

niharika konidela

అయితే హ్యాపీ గా భర్తతో కలిసి సంసార సాగరాన్ని ఈదుతున్న నిహారిక ఇటీవల పబ్ ఇష్యూ లో ఆరోపణలు ఎదురుకుంది. కానీ పోలీసులు నిహారిక ఎలాంటి తప్పు చేయలేదు అని కేవలం అర్థ రాత్రి దాటిన తరవాత పబ్ లో ఉండటం వల్లే విచారించామని చెప్పారు. అయితే అంతకు ముందే నిహారిక ఏవో కారణాలవల్ల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డియాక్టివేట్ చేసుకుంది.

Advertisement

Advertisement

కానీ పబ్ ఇష్యూ జరిగిన తరువాత గాసిప్స్ రావడం వల్ల కొన్ని రోజులకు తిరిగి ఇన్స్టా యాక్టివేట్ లోకి తీసుకు వచ్చింది. అప్పటి నుండి నిహారిక మళ్లీ వర్కౌట్ వీడియో లు…. సినిమాలకు సంబంధించిన అంశాలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది. ఇక రీసెంట్ గా నిహారిక అభిమానులతో కలిసి సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది.

ఈ సందర్భంగా ఓ నెటిజన్ తిక్క ప్రశ్న వేశాడు. మీరు సింగిల్ ఆ అంటూ ప్రశ్నించాడు. దాంతో అతడికి నిహారిక దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చింది. తన భర్తతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసిన నీహారిక “నేను సింగిలా” అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇక మరో నెటిజన్ నీ ఫోన్ నెంబర్ కావాలి అంటూ అడిగాడు. దానికి నిహారిక ష్….. అంటూ సమాధానం దాటవేసింది.

Visitors Are Also Reading