మెగాడాటర్ నిహారిక కొనిదెల పరిచయం అక్కర్లేని పేరు. మెగాడాటర్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన నిహారిక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ గా హీరోయిన్ గా నటిగా ప్రేక్షకులను అలరించింది. అంతే కాకుండా ఇటీవల వెబ్ సిరీన్ ను నిర్మించి నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇక 2020 డిసెంబర్ నెలలో నిహారిక చైతన్య అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
పెళ్లి తరవాత నిహారిక మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. కానీ నిర్మాతగా ఓ ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ ను నిర్మించి నిహారిక సక్సెస్ అయ్యింది. ఇదిలా ఉండగా నిహారిక సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన ఫోటోలతో పాటూ పర్సనల్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ నిహారిక సందడి చేస్తూ ఉంటుంది.
Advertisement
Advertisement
ఇదిలా ఉండగా నిహారిక ఇప్పుడు తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్ ను పూర్తిగా క్లోజ్ చేసుకుంది. నిహారిక తన ఇన్స్టా గ్రామ్ అకౌంట్ ను సడెన్ గా డిలీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే నిహారిక రీసెంట్ గా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోపై చాలా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిహారిక ఇన్స్ట్రా గ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసిందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.