Home » విడాకుల కోసం మెగా డాటర్ నిహారిక దరఖాస్తు ?

విడాకుల కోసం మెగా డాటర్ నిహారిక దరఖాస్తు ?

by Bunty
Ad

మెగా కుటుంబంలో మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. కొణిదెల నాగబాబు కుమార్తె మెగా డాటర్ కొణిదెల నిహారిక విడాకులకు దరఖాస్తు చేసుకుంది. తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యతో… విభేదాల కారణంగా గత కొన్ని రోజులుగా మెగా డాటర్ నిహారిక దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే.

Advertisement

 

అయితే తాజాగా నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే…హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు లో కొణిదల నిహారిక విడాకులకు దరఖాస్తు చేసుకుందని ప్రాథమిక సమాచారం అందుతుంది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన ఎన్ టీవీలో ప్రసారమైన సమాచారం మేరకు… కొణిదెల నిహారిక… విడాకుల కోసం ఫ్యామిలీ కోటు లో దరఖాస్తు చేసుకుందని తెలుస్తోంది.

Advertisement

తమ పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పటికే నిహారిక మరియు వెంకటచైతన్య తొలగించారు. దీంతో వీరిద్దరి విడాకులు ఖాయమేనని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నిహారిక కోర్టు మెట్లు ఎక్కడంతో… ఈ వార్తలకు బలం చేకూరినట్లయింది.

Visitors Are Also Reading