Telugu News » బ్రేకింగ్ : 62 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్

బ్రేకింగ్ : 62 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్

by Bunty
Ad

న్యూజిలాండ్, టీమ్ ఇండియా ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో లో న్యూజిలాండ్ జట్టు కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి విలవిలలాడింది న్యూజిలాండ్ బ్యాటింగ్ బృందం.

Advertisement

Advertisement

ఓపెనర్ లాథం 10 పరుగులు, కాల్ జాన్సన్ 17 పరుగులు మినహా ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా రాణించలేకపోయారు. దీంతో 28 ఓవర్లలోనే న్యూజిలాండ్ జట్టు 62 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఇండియా బౌలర్లలో మహ్మద్ మూడు వికెట్లు, రవీంద్ర జడేజా 4 వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు, జయంతి యాదవ్ ఒక వికెట్ తీసి న్యూజిలాండ్ జట్టుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. దీంతో టీమిండియాకు 263 పరుగుల లీడ్ లభించింది. ఇక అంతకు ముందు టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులకు మధ్యాహ్నం ఆలౌటయింది. మరి కాసేపట్లోనే టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.

Visitors Are Also Reading