Home » వాట్సాప్ లో మ‌రో కీల‌క అప్డేట్…ఇలా సెట్ చేసుకోండి..!

వాట్సాప్ లో మ‌రో కీల‌క అప్డేట్…ఇలా సెట్ చేసుకోండి..!

by AJAY
Ad

ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్ ల వాడ‌కం పెరిగిపోయింది. ప్ర‌తి ఒక్క‌రిద‌గ్గ‌ర స్మార్ట్ ఫోన్ లు ఉంటున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ ఫోన్ లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ల వాడ‌కం పెర‌గ‌టానికి ధ‌ర త‌గ్గ‌టంతో ప్ర‌తిఒక్క‌రికీ అందుబాటులోకి రావ‌డం కూడా ఒక కార‌ణ‌మే. ఇక స్మార్ట్ ఫోన్ ఉందంటే అందులో మొద‌ట‌గా ఉండాల‌నుకునే యాప్ వాట్స‌ప్. ఈ యాప్ లేకుండా స్మార్ట్ ఫోన్ ను చూడ‌లేమేమో. ఎన్నో చాటింగ్ యాప్ లు అందుబాటులోకి వ‌చ్చినా వాట్స‌ప్ ను బీట్ చేయ‌లేక‌పోయాయి.

ALSO READ : లక్ష్మీపార్వతి ఆధీనంలో ఉన్న ఎన్టీఆర్ మ్యూజియం ఉందా?

Advertisement

దాంతో ప్ర‌పంచ వ్యాప్తంగా వాట్స‌ప్ వాడుతున్న‌వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. ఇక వాట్స‌ప్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అప్డేట్ ల‌ను తీసుకువ‌స‌స్తూ యూజ‌ర్ ఫ్ల్రెండ్లీ యాప్ గా ఉంటోంది. ఇప్ప‌టికే వాట్స‌ప్ లో ఎన్నో అప్డేట్ లు వ‌చ్చాయి. కేవ‌లం చాటింగ్ మాత్ర‌మే కాకుండా వాట్స‌ప్ లో గ్రూప్ చాటింగ్..వీడియో కాలింగ్ తో పాటూ ఎన్నో స‌దుపాయాలు ఉన్నాయి.

Advertisement

గ్రూప్ చాటింగ్ ను మొద‌ట‌గా వాట్స‌ప్ 2011లో అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. అయితే వాట్స‌ప్ గ్రూప్ ల వ‌ల్ల కొన్ని న‌ష్టాలు కూడా ఉన్నాయి. గ్రూప్ లో ఎవ‌రు ప‌డితే వాళ్లు జాయిన్ అవ్వ‌డం అనుచిత లేద అశ్లీ* ఫోటోలు వీడియోలు పంప‌డం లాంటివి జ‌రుగుతున్నాయి. ఇక ఇప్పుడు వాట్స‌ప్ గ్రూప్ లింక్ ను షేర్ చేస్తే జాయిన్ అయ్యే ఆప్ష‌న్ ఉంద‌నే సంగ‌తి తెలిసిందే.

కాగా ఇప్పుడు వాట్స‌ప్ గ్రూప్ లింక్ ను షేర్ చేసిన‌ప్పుడు ఎవ‌రు యాడ్ అవ్వాలి..ఎవ‌రిని యాడ్ చేయ‌కూడ‌దు అనేది కూడా అడ్మిన్ చేతిలోనే ఉండేలా అప్డేట్ వ‌చ్చేసింది. దానికోసం గ్రూప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అప్రూవ్ పార్టిసిపెంట్ అనే ఆప్ష‌న్ ను క్లిక్ చేస్తే స‌రిపోతుంది. కేవ‌లం ఎంపిక చేసిన‌వారే గ్రూప్ లో జాయిన్ అవుతారు. ఈ అప్డేట్ తో అడ్మిన్ కు రిస్క్ కూడా తగ్గుతంది.

ALSO READ :సెంచరీ తర్వాత కోహ్లీ ముద్దాడుతున్న ఈ లాకెట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Visitors Are Also Reading