ప్రతి నెల కూడా కొన్ని కొత్త రూల్స్ వస్తాయి అలానే ఫిబ్రవరి 1 నుండి కూడా కొన్ని రూల్స్ రాబోతున్నాయి. కొత్త బడ్జెట్ కారణంగా ఫిబ్రవరి నుండి కొన్ని అంశాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆ మార్పులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్స్ పై భారీ తగ్గింపుని అందిస్తోంది. 65 బిపిఎస్ కంటే తక్కువ వడ్డీ రేట్లకి హోమ్ లోన్స్ అందిస్తోంది. హోమ్ లోన్స్ మీద ప్రాసెసింగ్ ఫీజు రాయితీలకి చివరి తేదీ జనవరి 31 సో ఫిబ్రవరిలో ఈ విషయంలో మార్పు ఉంటుంది చూసుకోండి.
Advertisement
Advertisement
అలానే నేషనల్ పెన్షన్ సిస్టం లో కూడా మార్పులు రాబోతున్నాయి. మొదటిసారి ఇల్లు కొనుక్కునే వాళ్ళకి మాత్రమే ఈ ఖాతా నుండి మొత్తం విత్ డ్రా చేసుకోగలరని తెలుస్తోంది ఈ నిబంధన వచ్చే నెల ఒకటి నుండి అమలులోకి రాబోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్ చివరి విడతని ఫిబ్రవరిలో విడుదల చేస్తుంది. ఎస్జిబి 23 24 సిరీస్ 4 ఫిబ్రవరి 12న ఓపెన్ అవుతుంది 16 ఫిబ్రవరి 2024 తో ముగుస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!