Home » New Railway Rules:కొత్త రైల్వే రూల్స్.. ఇక అలా కూర్చోవడం కుదరదు..!!

New Railway Rules:కొత్త రైల్వే రూల్స్.. ఇక అలా కూర్చోవడం కుదరదు..!!

by Sravanthi
Ad

ప్రపంచంలోనే అతిపెద్దగా ఉన్నటువంటి రైల్వే వ్యవస్థల్లో మూడవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ మన ఇండియాదని చెప్పవచ్చు. ప్రతిరోజు లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వారికి ఇష్టమైన సీటు పొందడానికి వారు ఒక నెల ముందుగానే టికెట్లను బుక్ చేసుకుంటారు. చాలామంది ప్రయాణికులకు లోయరు బెర్త్ లేదా సైడ్ లోయర్ బెర్త్ కావాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుతం ఈ సీట్ ను బుక్ చేసుకోరాదు. భారతీయ రైల్వే ఈమెరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వారి ఉత్తర్వుల ప్రకారం ఇకనుండి రైలు దిగువ బెర్తు కొన్ని వర్గాలకు కేటాయించబడుతోంది.

Advertisement

Also Read:సమంత నాగచైతన్య విడాకుల వల్ల ఆ దోషం పట్టుకుందా.. అందుకే వరుస ఫ్లాపులు వస్తున్నాయా..?

ఇంతకీ అది ఎవరికి అయ్యా అంటే వికలాంగులకి లేదంటే శారీరకంగా వికలాంగులు లేదంటే మానసిక వికలాంగులకు ఈ దిగువ బెర్త్ రిజర్వ్ చేసింది. వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడం కోసం భారతీయ రైల్వే ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రైల్వే బోర్డు ఆదేశాల ప్రకారం.. స్లీపర్ క్లాస్ లోని వికలాంగులకు నాలుగు సీట్లు, రెండు దిగువన, రెండు మధ్య, థర్డ్ ఏసీలో రెండు, ఏసీ 3 ఎకనామీలో రెండు సీట్లు రిజర్వు చేయబడ్డాయి. దివ్యాంగులతో ప్రయాణించే వ్యక్తులు ఈ సీట్లో కూర్చోవచ్చు. ఇదే సమయంలో గరీబ్ రథ్ రైలులో రెండు దిగువ సీట్లు , రెండు పై సీట్లు వికలాంగుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి . ఈ సీట్ల కోసం వారు పూర్తి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Also Read:తెలుగు రాష్ట్రాల్లో సోను సూద్ కొత్త పార్టీ..పవన్ తో పొత్తు ఉంటుందా ..?

అంతేకాకుండా భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్ లకు వారు అడగకుండానే లోయర్ బెర్తులు ఇస్తుంది. స్లీపర్ క్లాస్ లో ఆరు నుంచి ఏడు లోయర్ బెర్తులు , ప్రతి థర్డ్ ఏసీ కోచ్ లో మూడు నుండి ఐదు లోయర్ బెర్తులు 45 ఏళ్లు లేదా గర్భిణీ స్త్రీలకు రైలులో రిజర్వ్ చేయబడ్డాయి. వారు ఎంపిక చేసుకోకుండానే ఈ ఆటోమేటిక్ సీట్ పొందుతారు. మరోవైపు పై సీట్లో సీనియర్ సిటిజన్, దివ్యాంగులు లేదా గర్భిణీ స్త్రీలకు టికెట్ బుకింగ్ ఇస్తే ఆన్ బోర్డు టికెట్ చెకింగ్ సమయంలో వారికి దిగువ సీటు ఇవ్వడానికి టీటీకి అధికారం ఇచ్చింది రైల్వే శాఖ.

Also Read:వైజ‌యంతీ బ్యాన‌ర్ లోగో కు అన్న‌గారి ఫోటో ఎందుకు ఉంటుంది..? దాని వెన‌క ఉన్న స్టోరీ ఏంటి..?

Visitors Are Also Reading