కొత్తగా పెళ్లి జరిగితే అత్తింటికి కోడలు వస్తుంటుంది. కొంత మంది బస్సుల్లో.. కొంత మంది బైకుల్లో.. మరికొందరు ఆటో.. లేదా కారు ఇతర వేరే వాహనాలలో అత్తగారింటికి వస్తుంటారు. కానీ ఓ కొత్త కోడలు ఏకంగా హెలికాప్టర్‌లో వచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Ad
పుట్టింటిని వెళ్లి తమ ఇంటి కోడలుగా వస్తున్న అడుగుపెట్టబోతున్న నూతన వధువును అత్తింటివారు ఘనంగా ఆశీర్వదించాలని అనుకున్నారు. ఏకంగా అత్తింటి వారు లక్ష రూపాయలు ఖర్చు చేసి ఓ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకొని మరీ కోడలును ఇంటికి తెచ్చుకున్నారు. కోడలును అత్తింట్లో అడుగుపెట్టబోతున్న కోడలుకు జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకాన్ని పంచింది ఆ కుటుంబం. ఈ అరుదైన ఘటన రాజస్థాన్‌లోని బార్మార్ జిల్లాలో జరిగింది.
Advertisement
పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని విదానియాన్ తరుణ్ మెగాల్ అనే వ్యక్తికి దియాతో వివాహం జరిగింది. వారిద్దరూ పెళ్లి తంతు ముగిసిన తరువాత వారిద్దరూ హెలికాప్టర్‌లో బార్మార్ నగరంలోని జసిన్‌పాగ్ ఖాన్‌కు చేరుకున్నారు. ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తొలిసారి మెట్టింటికి వస్తున్న కోడలును హెలికాప్టర్‌లో తీసుకురావాలన్నది ఆ కుటుంబం కల. అయితే అది ఏమి అంత సులభంగా సాధ్యం కాలేదు. తొలుత మాట్లాడుకున్నంత సులభం ఏమి కాలేదు. దీంతో అదనంగా మరో లక్ష రూపాయలు చెల్లించి ఇంకో హెలికాప్టర్‌ను మాట్లాడుకున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే.. తమ కోడలును హెలికాప్టర్‌లో తెచ్చుకున్న ఈ కుటుంబం సంపన్నకుటుంబమేమి కాదు. సామన్య దళిత కుటుంబమే. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు.