Home » మ‌నోజ్ పెళ్లిలో విష్ణు తీరు చూసి అవాక్కవుతున్న నెటిజ‌న్లు..ఇలా చేశావేంటి అంటూ ఫైర్.?

మ‌నోజ్ పెళ్లిలో విష్ణు తీరు చూసి అవాక్కవుతున్న నెటిజ‌న్లు..ఇలా చేశావేంటి అంటూ ఫైర్.?

by AJAY
Ad

టాలీవుడ్ హీరో మంచు వార‌సుడు మంచు మ‌నోజ్ తాను ప్రేమించిన భూమా మౌనిక‌రెడ్డిని మార్చి 3న వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. మ‌నోజ్ సోద‌రి మంచు ల‌క్ష్మీ ఇంట్లో ఆవిడే ద‌గ్గ‌రుండి వీరి వివాహాన్ని జ‌రిపించింది. ఇక ఈ పెళ్లికి ద‌గ్గ‌రి బంధువులు మ‌రియు స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రయ్యారు. అంతే కాకుండా సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు సైతం పెళ్లికి హాజ‌ర‌య్యారు.

Advertisement

ఇక పెళ్లికి ముందు మౌనికారెడ్డి మ‌నోజ్ లు ప్రేమించుకున్నారు. అంతే కాకుండా ఇద్ద‌రికీ ఇది రెండో పెళ్లి కావ‌డం విశేషం. ఇక మ‌నోజ్ త‌న భార్య‌తో విడాకుల త‌ర‌వాత త‌న స్నేహితురాలు అయిన మౌనికరెడ్డిని ప్రేమించాడు. ఇద్ద‌రూ కొంత‌కాలం చెన్నైలో కలిసి ఉన్నారంటూ కూడా వార్త‌లు వినిపించాయి.

Advertisement

అంతే కాకుండా వీరి వివాహం సైలెంట్ గా జ‌రుగుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ మ‌నోజ్ మౌనిక‌ల వివాహం ఘ‌నంగానే జ‌రిగింది. ఇక త‌మ్ముడి పెళ్లి అంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి. అన్న ద‌గ్గ‌రుండి అన్ని ప‌నులు చూసుకోవాల్సి వ‌స్తుంది. అయితే మంచు విష్ణు అలా చేయ‌లేద‌ని నెటిజ‌న్ లు ట్రోల్ చేస్తున్నారు.

Manoj Marriage

Manoj Marriage

మొద‌టి నుండి మ‌నోజ్ పెళ్లి మోహ‌న్ బాబుకు ఇష్టం లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ మోహ‌న్ బాబు మ‌నోజ్ పెళ్లిని ద‌గ్గ‌రుండి జ‌రిపించారు. కానీ విష్ణు మాత్రం త‌న భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి అతిధిలా పెళ్లికి హాజ‌ర‌య్యాడు. అంతే కాకుండా పెళ్లిలో కూడా ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌లేద‌ని తెలుస్తోంది. ఇక మ‌నోజ్ ఫోటోలు వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్ లు విష్ణు అలా చేస్తావా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ALSO READ :“బలగం” వివాదంపై జబర్దస్త్ వేణు క్లారిటీ.. అసలు కథ ఎవరిదంటే ?

Visitors Are Also Reading