ప్రస్తుతం యువత తమ పెళ్లిని ట్రెండుకు తగ్గట్టుగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పటిలాగా సాదాసీదాగా చేసుకోవడానికి అసలు ఆసక్తి చూపించడం లేదు. తమ పెళ్లి వేడుక ఒక రేంజ్ లో ఉండాలంటూ రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్ లను సంప్రదిస్తున్నారు. ఖర్చుకు కూడా ఏమాత్రం వెనకాడడం లేదు.
ఫ్రీ వెడ్డింగ్ నుంచి అప్పగింతల వరకు ప్రతి ఒక్క ఈవెంట్ జీవితంలో మర్చిపోలేని విధంగా ఉండేలా ప్లాన్ వేస్తున్నారు. దానికోసం మంచి మంచి లొకేషన్ లు, కొండలు, గ్రీనరీ ఉన్న ప్రదేశాలు కాస్ట్లీ కాస్ట్యూమ్స్ ధరించి ఈవెంట్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఒక యువతి మాత్రం తన వెడ్డింగ్ షూట్ కోసం గుంతలు పడిన రోడ్డును ఎంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Advertisement
పూర్తి వివరాలు.. కేరళకు చెందిన ఒక నవవధువు తన పెళ్లి ఫోటో షూట్ కోసం గుంతలు పడిన రోడ్లను ఎంచుకుంది. ఆమె అందంగా రెడీ అయ్యి.. గుంతలు పడిన రోడ్లగుండా నడుచుకుంటూ వస్తుంది. కాగా ఆ ప్రాంతంలో రోడ్లన్నీ వర్షం పడి పూర్తిగా గుంతలుగా మారిపోయాయి. కనీసం యువతి సరిగ్గా నడవలేక ఇబ్బందులు పడుతుంది. కనీసం ఈ రకంగా అయినా.. తాము ఎదుర్కొంటున్న బాధలు అధికారులు, నాయకు వరకు వెళుతుందని నవవధువు ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.
Also Read : Chanakya Niti : భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలంటే ఇవి తప్పకుండా పాటించాలి..!