సినిమా అభిమానులకు ఓ విలన్ గానే పరిచయం ఉన్నా సోను సూద్… కరోనా కష్టకాలంలో హీరో అయ్యాడు. సినిమాల్లోని వారంతా.. రిల్ హీరోలు… కానీ సోను సూద్ రియల్ హీరో అని అభిమానులతో అనిపించుకున్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో దాదాపుగా ఓ రాష్ట్రప్రభుత్వం చేసే పనులను… అంత పెద్ద పెద్ద కార్యక్రమాలను చెప్పటి.. వలస కూలీలను తమ తమ నివాస ప్రాంతాలకు చేర్చాడు. అలాగే ఎందరో కరోనా పేషేంట్లకు సహాయం కూడా అందించాడు.
Advertisement
దాంతో ప్రజలు చాలా మంది తమ సమస్యలను సోషల్ మీడియా వేదికగా… సోను సూద్ కు వివరించగా వారికీ సాహయం చేసాడు. ఇందులోనే కొంతమంది పిచ్చి పిచ్చి సమస్యలు చెప్పగా.. మరికొంతమంది కామెడీ సమస్యలను వివరించగా.. వాటికీ తన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆలాంటి ఓ సమస్య సోను ముందుకు వచ్చింది. అందులో ఓ వ్యక్తి… నేను భార్య బాధితుడిని.. నా భార్య రోజు నా రక్తం తాగుతోందని.. దీనికి ఏదైనా పరిష్కారం చూపించాలని కోరాడు. దీనికి సోను ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ గా మారింది.
Advertisement
సోను ట్విట్టర్ వేదికగా.. బ్రదర్ అది భార్యల జన్మహక్కు. కాబట్టి నువ్వు కూడా నాలాగానే ఆ రక్తంతో ఓ బ్లెడ్ బ్యాంకు ఓపెన్ చెయ్యి అంటూ ఓ స్మైలీని జత చేసాడు. దాంతో ఇప్పుడు సోను సూద్ సెన్సాఫ్ హ్యూమర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే కరోనా సమయంలో బ్లెడ్ బ్యాంక్స్ ఓపెన్ చేసి ఎందరికో సోను సహాయం చేసిన సంగతి అందరికి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
ట్రాన్స్ జెండర్లు ఎప్పుడైనా కలలో కనిపించారా..? అయితే దాని అర్ధం ఇదే..?
ఐపీఎల్లో టాప్ 5 రిచెస్ట్ టీమ్ ఓనర్లు వీరే..!