ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2016లో ఇండియాలో అడుగుపెట్టిన నెట్ ఫ్లిక్స్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా ఓటీటీ రంగంలో టాప్ ప్లేస్ లో ఉన్న డేట్ ఫిక్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలో కి అడుగుపెట్టిన ఆరేళ్ల తర్వాత సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ ధరలను భారీగా తగ్గించింది. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వన్ మంత్ ప్లాన్ 149 నుండి 199 కి పెంచింది.
అయితే ఆ వెంటనే నెట్ఫ్ ఫ్లిక్స్ మాత్రం వన్ మంత్ ప్లాన్ రూ. 199 నుండి రూ.149 కి తగ్గించడం విశేషం. నెట్ ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మరింతమంది సబ్స్క్రైబర్ లను ఆకర్షించే అవకాశం ఉంది. ఇక రూ. 149 సబ్స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా సింగిల్ ఫోన్, ట్యాబ్ లో 480p వీడియోలు చూడవచ్చు. బేసిక్ ప్లాన్ రూ.199 ద్వారా సింగిల్ మొబైల్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీ లలో ఒకేసారి వీడియోలు చూడవచ్చు. అంతే కాకుండా రూ.499 స్టాండర్డ్ ప్లాన్ ద్వారా రెండు వేరు వేరు డివైజ్ లలో ఒకేసారి 1080p క్వాలిటీ తో వీడియోలు చూడవచ్చు.
Advertisement
Advertisement
ఈ ప్లాన్ కు గతంలో రూ.649 చెల్లించాల్సి వచ్చేది. ప్రీమియం ప్లాన్ రూ.649 ద్వారా 4k ప్లస్ హెడ్ డీఆర్ వీడియోలు చూడవచ్చు. అంతే కాకుండా ఒకేసారి నాలుగు డివైస్ లలో చూసే వెసులుబాటు ఉంటుంది. ఇదిలా ఉండగా యూజర్లకు అప్ గ్రేడ్ ఫీచర్ ను డిసెంబర్ 14-2021 నుండి అందించనున్నారు. ఒకవేళ బేసిక్ ప్లాన్ లో యాక్టిివ్ గా ఉన్నట్లయితే అప్గ్రేడ్ ను తిరస్కరించవచ్చు. అంతే కాకుండా కొత్త ప్లాన్ తక్కువ ధరలో పొందవచ్చు. ఇక నెట్ ఫ్లిక్స్ లో మిగతా ఓటీటీల కంటే హాలీవుడ్ సిరీస్ లు, హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ధరల తగ్గింపు తో సబ్ స్క్రైబర్ లు పెరిగే ఛాన్స్ ఉంది.