Home » వేప చెట్టుకు వింతరోగం…ఇలా చేసి కాపాడుదాం..!

వేప చెట్టుకు వింతరోగం…ఇలా చేసి కాపాడుదాం..!

by AJAY
Ad

ఎక్కడ చూసినా ఎక్కువగా కనిపించేవి వేప చెట్లే. మనపూర్వీకులు వీటిని సంజీవని గా కొలిచేవాళ్ళు. ఎండాకాలం వచ్చిందంటే చల్లని నీడనిచ్చే ఈ చెట్లు ప్రతి ఇంటి ముందు దర్శనమిస్తుంటాయి. అంతే కాకుండా వేపచెట్టు తో ఎన్నో రకాల ఔషధాలను తయారు చేస్తూ ఉంటారు. అనాధి నుంచి ఇప్పటివరకు వేప చెట్టు ను ఔషధాల తయారీకి వాడుతూ ఎన్నో రోగాలను నయం చేస్తున్నారు. అందువల్లే వేపచెట్టును సంజీవని అని కూడా అంటారు. అయితే అలాంటి వేప చెట్టుకు ఇప్పుడు పెద్ద ముప్పే వచ్చింది.

Neem tree

Neem tree

రాష్ట్రంలోని వేప చెట్లు బైబ్యాక్ వ్యాధితో బాధ పడుతున్నాయి. ఫోమోప్సిస్ అజారిక్ట అనే శిలింధ్రం సోకడం వల్ల వేప చెట్లు ఎండిపోయి చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వేప చెట్టును కాపాడుకోవాలంటూ వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రజాప్రతినిధులు, రైతులు, సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకుని వేప చెట్టును కాపాడుకోవాలని కోరింది. అంతేకాకుండా వేప చెట్లను కాపాడుకోవడానికి కార్బెండిజం (50శాతం డబ్ల్యుపీ) మందును లీటర్ నీటిలో 2గ్రాములు కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిసేలా పోస్తే వేర్లు, కాండం చెట్టు మొదలు లో ఉన్న శిలింధ్రాన్ని తొలగించవచ్చు అని పేర్కొంది.

Advertisement

Advertisement

Neem tree

Neem tree

 

ఏడు రోజుల తరవాత థయోఫనెట్ మిథైల్ (70 శాతం డబ్ల్యూ పీ) మందును లీటర్ నీటిలో 2గ్రాములు కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిచేలా పోస్తే చెట్టు మొత్తానికి ఈ మందు చేరి శిలింధ్రాన్ని నాశనం చేస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఇక ఇది మార్కెట్ లో రోకో, తెరఫీ తదితర పేర్లతో దొరుకుతుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 20 రోజుల తర్వాత మూడో చర్యల్లో భాగంగా ప్రోఫినో పాస్ అనే మందును లీటర్ నీటిలో మూడు మిల్లీ లీటర్లు కలిపి చెట్టు మొదలు తడిచేలా పోయాలని పేర్కొంది. ఇలా చేస్తే వేప చెట్టును కాపాడుకోవచ్చని…ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని రక్షించాలని కోరింది. అంతే కాకుండా మరింత సమాచారం కోసం స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరింది.

Visitors Are Also Reading