Home » ‘నీ స్నేహం’ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా ?

‘నీ స్నేహం’ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా ?

by Bunty
Ad

టాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచుకున్న హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఉదయ్ కిరణ్ వరుస హిట్లతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ముఖ్యంగా అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఉదయ్ కిరణ్ పేరు సంపాదించుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆత్మ** చేసుకున్నాడు.

Advertisement

అయితే ఉదయ్ కిరణ్ కెరియర్ లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో నీ స్నేహం ఒకటి. ఈ మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా నటించిన జతిన్ కూడా పాత్రలో ఒదిగిపోయాడు. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాయి. జతిన్ హిందీ నటుడు. ముంబైలో పుట్టిన ఆయన మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు ప్రైవేట్ ఆల్బమ్స్, హిందీ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

పలు టీవీ కార్యక్రమాల్లో కూడా నటించారు. తెలుగుతోనే కాకుండా హిందీతో పాటు పంజాబీ చిత్రాల్లో నటించారు. తెలుగులో కేవలం నీ స్నేహం సినిమాలో మాత్రమే నటించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. 2010లో కరోలినా గ్రేవాల్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

Visitors Are Also Reading