ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న భారత క్రికెటర్లు అందరూ… దాదాపుగా గత ఏడాది నుండి గ్యాప్ లేకుండా ఆట అడవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఐపీఎల్ పూర్తయిన తర్వాత కూడా భారత జట్టుకు వరుస సిరీస్ లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ తో టీ20 సిరీస్ తర్వాత వెంటనే ఇంగ్లాండ్ పర్యటన ఉంటుంది. అక్కడ కూడా గత ఏడాది వాయిదా పడిన ఒక్క టెస్ట్ మ్యాచ్ తో పాటుగా టీ20 సిరీస్ జరగనుంది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ ల మధ్యలో టీం ఇండియా ఇండియా హెడ్ కోచ్ పదవి భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ చేతికి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Advertisement
అయితే ఎన్నోసార్లు తనకు హెడ్ కోచ్ పదవిని ఇస్తాను.. అంటే దానిని రిజెక్ట్ చేసి గత ఏడాదే ఆ భాద్యతాలను తీస్కున్నాడు ది వాల్ రాహుల్ ద్రావిడ్. ఆయనకు అంత బతిమిలాడి ఇచ్చిన ఆ పదవిని ఇప్పుడు మళ్ళీ వీవీఎస్ కు ఇవ్వడం ఏంటి అభిమానులు తికమకలో పడ్డారు. అయితే వీవీఎస్ కు హెడ్ కోచ్ పదవిని ఇవ్వడం నిజమే కానీ… అది పూర్తి స్థాయిలో కాదు… కేవలం దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ తో జరగబోయే టీ20 సిరీస్లకు మాత్రమే వీవీఎస్ హెడ్ కోచ్ గా వ్యవరించనున్నాడు.
Advertisement
మన భారత ఆటగాళ్లు మొత్తం రెస్ట్ లేకుండా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్ లకు సీనియర్ ఆటగాళ్లకు అందరికి రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ద్రావిడ్ కూడా విశ్రాంతి తీసుకోగా… యువ ఆటగాళ్లతో కూడిన జట్టుకు వీవీఎస్ హెడ్ కోచ్ గా వ్యవరించనున్నాడు. ఈ రెండు సిరీస్ లు పూర్తయిన తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు సీనియర్లతో పాటుగా ద్రావిడ్ కూడా మళ్ళీ హెడ్ కోచ్ గా కొనసాగుతారు అని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :
2007లో చేసినట్లు.. ఇప్పుడు చేస్తే ప్రపంచ కప్ పక్క..!
తిలక్ వర్మ అన్ని ఫార్మట్స్ లో భారత్ కు ఆడుతాడు..!