Home » NBK 107 : సిరిసిల్లలో బాలయ్య సందడి…వైరల్ అవుతున్న కొత్త లుక్…!

NBK 107 : సిరిసిల్లలో బాలయ్య సందడి…వైరల్ అవుతున్న కొత్త లుక్…!

by AJAY
Published: Last Updated on
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహించగా బాలయ్య డ్యుయల్ రోల్ లో అలరించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో అఘోర పాత్రలో బాలయ్య అదరగొట్టారు. ఈ చిత్రం తో బాలయ్య బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ పడింది.

Advertisement

Advertisement

ఇక ఈ చిత్రం తరవాత బాలయ్య మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ సిరిసిల్ల లో ప్రారంభం అయ్యింది. ఇక మొదటిరోజు రామ్ లక్ష్మణ్ తో ఓ యాక్షన్ సీన్ ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ షూటింగ్ స్పాట్ కు సంబందించిన ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో బాలయ్య బ్లాక్ షర్ట్ లో లుంగీ కట్టుకుని ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నారు. నలిసిన గడ్డం తో బాలయ్య ఎంతో అందంగా ఉండటం తో ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఇక లుక్ చూస్తేనే సినిమా పై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరో వైపు గోపీచంద్ క్రాక్ తో బాలయ్య అఖండ తో హిట్ కొట్టి ఉన్నారు. దాంతో వీరి కాంబినేషన్ పై కూడా అంచనాలు పెరిగిపోయాయి.

Visitors Are Also Reading