Home » పెళ్లి త‌రువాత న‌య‌న‌తార ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యున‌రేష‌న్‌ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పెళ్లి త‌రువాత న‌య‌న‌తార ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యున‌రేష‌న్‌ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Published: Last Updated on
Ad

అందం, అభిన‌యంతో ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో లేడీ సూప‌ర్ స్టార్ గా ఆమె పేరు సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌. దాదాపు 20 సంవ‌త్స‌రాలుగా కొన‌సాగుతున్న ఈమె ఇటీవ‌లే త‌న ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ తో క‌లిసి పెళ్లి పీట‌లెక్కింది. పెళ్లి త‌రువాత మ‌రింత జోరు పెంచిన న‌య‌న‌తార వ‌రుసగా సినిమా ప్రాజెక్టుల‌కు ఓకే చెబుతుంది. తాజాగా త‌న 75వ సినిమాకు ప‌చ్చ‌జెండా ఊపేసింది. #Ladysuperstar75 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం అయింది.

Advertisement

ఇదిలా ఉండ‌గా.. ప్రారంభం ఉంచే స్టార్ హీరోల‌తో స‌మానంగా పారితోషికం తీసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు రూ.3 కోట్ల నుండి రూ.5 కోట్ల వ‌ర‌కు రెమ్యునరేష‌న్ తీసుకున్న ఈమె ఆ త‌రువాత రూ.7కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని వార్త‌లు వినిపించాయి. తాజాగా నూత‌న చిత్రానికి ఏకంగా న‌య‌న్‌.. రూ.10కోట్లు అడుగుతున్న‌ట్టు త‌మిళ మీడియా కోడై కూస్తుంది. మొత్తానికి పైళ్లై త‌రువాత కూడా న‌యన్ మార్కెట్ త‌గ్గ‌క‌పోగా పెర‌గ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మే అని చెప్ప‌వ‌చ్చు. త‌న కొత్త చిత్రానికి అన్న‌పూర‌ణి అన్న టైటిల్ ను ఫిక్స్ చేశార‌ట‌. ప‌వ‌ర్ పుల్ బిజినెస్ ఉమ‌న్ పాత్ర‌లో న‌య‌న్ క‌నిపించనున్న‌ట్టు తెలుస్తోంది. ఓ ప‌వ‌ర్ పుల్ బిజినెస్ ఉమెన్ పాత్ర‌లో న‌య‌న్ క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

ఇదిలా ఉండ‌గా.. జ‌న‌వ్ సినిమాతో హిందీలో అడుగుపెట్ట‌నుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇందులో హీరోగా న‌టిస్తున్నా డు. అట్లీ ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. అదేవిదంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి గాడ్‌ఫాద‌ర్ చిత్రంలోనూ హీరోయిన్‌గా క‌నిపించ‌నున్న‌ది. వీటితో పాటు గోల్డ్, పింక్ పోలీస్ (మ‌ల‌యాళం), ఇరైవ‌న్ కనెక్ట్ (త‌మిళం) సినిమాల్లో న‌టిస్తూ బిజిగా ఉంది. మొత్తానికి పెళ్లి త‌రువాత కూడా లేడీ సూప‌ర్ స్టార్ క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి.

Also Read : 

హీరోయిన్ పూజాహెగ్దే రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

Visitors Are Also Reading