Home » హీరోయిన్ పూజాహెగ్దే రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

హీరోయిన్ పూజాహెగ్దే రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

by Anji
Ad

సినీ ఇండ‌స్ట్రీలోకి చాలా మంది హీరోయిన్లు వ‌స్తుంటారు పోతుంటారు. అందులో స‌రిగ్గా నిల‌బ‌డేది కొంత మంది మాత్ర‌మే. కొంత మంది కొన్ని సినిమాల్లో అవ‌కాశం ద‌క్కించుకుంటే.. మ‌రికొంత మంది కొన్ని సినిమాల‌ను ఏదో ఒక కార‌ణంతో రిజెక్ట్ చేసిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారిలో హీరోయిన్ పూజాహెగ్దే ఒక‌రు. ఆమె ఏయే సినిమాల‌ను రిజెక్ట్ చేసిందో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

 

పూజాహెగ్దే ఈ సినిమాల‌ను చేసి ఉంటే మాత్రం క‌చ్చితంగా ఆమె లైఫ్ మ‌రోలా ఉండేదని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో డేట్ల‌ను కేటాయించ‌లేక స్టార్ హీరోల సినిమాల‌ను సైతం పూజాహెగ్దే రిజెక్ట్ చేసిన సంద‌ర్భాలున్నాయి. ఆమె రిజెక్ట్ చేసిన సినిమాలలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ ఒక‌టి. ఈ సినిమాలో శృతిహాస‌న్ న‌టించిన పాత్ర‌లో న‌టించే అవ‌కావం తొలుత పూజాకే వ‌చ్చింద‌ట‌. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె ఈ అవ‌కాశాన్ని వ‌దులుకున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

 

 

నితిన్ హీరోగా మేర్ల‌పాక గాంధీ డైరెక్ష‌న్‌లో అంధాదూన్ రీమెక్ గా తెర‌కెక్కిన మాస్ట్రో సినిమాలో త‌మ‌న్నా పోషించిన పాత్ర‌లో న‌టించే అవ‌కాశం పూజా హెగ్దే కు రాగా కొన్ని కార‌ణాల వ‌ల్ల పూజాహెగ్దే ఆ అవ‌కాశాన్ని వ‌దులుకుంది. ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్‌, అల్లుడు అదుర్స్, శాకుంత‌లం, హిందీ హీరో, గుడ్ బై, హిందీ అటాక్ సినిమాల్లో పూజాహెగ్దే ఛాన్స్ వ‌స్తే వ‌దులుకున్నార‌ట‌. ఈమె వ‌దులుకున్న సినిమాల్లో కొన్ని సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిస్తే మ‌రికొన్ని సినిమాలు మాత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేదు. పూజాహెగ్దే స్టార్ హీరోల సినిమాల‌ను రిజెక్ట్ చేయ‌డం మాత్రం కొన్ని సంద‌ర్బాల్లో ఆమె అభిమానులకు కూడా న‌చ్చ‌లేద‌ట‌. ఇక పూజాహెగ్దే తీయ‌బోయే సినిమాలు భారీ విజ‌యం సాధించాల‌ని అభిమానులు కోరుతున్నారు.

Also Read : 

చిరంజీవి వ‌ల్ల న‌ష్ట‌పోయిన అల్లుఅర్జున్.. ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పిన బ‌న్నీ..!

కృష్ణ న‌టించిన “నెంబ‌ర్ వ‌న్” సినిమా టైటిల్ విష‌యంలో ఎందుకు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి..?

 

Visitors Are Also Reading