నయనతార సౌత్ లో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళ భాషల్లో నయన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోలకు జోడీగా నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ లు అందుకుంది. ప్రస్తుతం నయన్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటూ సీనియర్ హీరోల పక్కన కూడా జత కడుతోంది. ఇక ఈ ముద్దుముగ్గ ఒక్కో సినిమాకు కళ్లు చెదిరే రెమ్యునరేష్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Advertisement
ఒక్క సినిమాకే ఈ ముద్దుగుమ్మ 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంట్టున్నట్టుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా హీరోలను బట్టి సినిమాను బట్టి కూడా ఈ బ్యూటీ ఎక్కువ తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఇదిలా ఉండగా నయన్ ఇటీవల తన ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివణ్ ను పెళ్లి చేసుకుంది. వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సినీరాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Advertisement
ఈ వివాహానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా కూడా సమాచారం. అంతే కాకుండా వీరి పెళ్లి వీడియో హక్కులను కూడా ఓ ఓటీటీ సంస్థకు భారీ డీల్ కు అమ్ముకున్నారు. ఇక ఇప్పటి వరకూ నయన్ 75 సినిమాల వరకూ హీరోయిన్ గా నటించింది. ఇక నయన్ సినిమాలతో పాటూ బ్రాండ్ ప్రమోషన్ లు మరియు షాప్ ఓపెనింగ్ ల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా సమాచారం.
నయనతార ఆస్తి విలువ ఏకంగా రూ.165 కోట్ల వరకూ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న సంస్థల నుండి ఒక్కో బ్రాండ్ కు రూ.5 కోట్ల వరకూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక నయన్ కు చెన్నై మరియు హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. చెన్నై లో విలాసవంతమైన ఇంటితో పాటూ హైదరాబాద్ లో ఫ్లాట్ లు మరియు బంగళాలు ఉన్నాయని తెలుస్తోంది.