Home » కవలలకు జన్మనిచ్చిన తల్లి పై నయన్ క్లారిటీ…! అన్నీ చెప్పేసిందిగా…!

కవలలకు జన్మనిచ్చిన తల్లి పై నయన్ క్లారిటీ…! అన్నీ చెప్పేసిందిగా…!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ స్టార్ హీరయిన్లు గా ఎక్కువ కాలం రానించేవాళ్లు త‌క్కువ మందే ఉంటారు. అలాంటి లిస్టులో న‌య‌న‌తార కూడా ఒక‌రు. న‌య‌న‌తార సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా రానిస్తున్నారు. వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అంతే కాకుండా న‌య‌న్ హీరోల‌కు దీటుగా రెమ్యునరేష‌న్ ను అందుకుంటుంది అంటే ఆమెకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

Advertisement

ఇక న‌య‌న్ త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికి వివాహం జ‌రిగి నాలుగు నెల‌లు అవుతోంది. అయితే పెళ్లైన నాలుగు నెల‌ల‌కే ఈ దంప‌తులు క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్టు ప్ర‌క‌టించారు. వీరిద్ద‌రూ స‌రోగ‌సి విదానం ద్వారా క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు.

Advertisement

అయితే పెళ్లి చేసుకున్న త‌ర‌వాత ఐదేళ్లు దాటిన త‌ర‌వ‌త‌నే పిల్ల‌లు క‌ల‌గ‌ని ప‌క్షంలో స‌రోగ‌సి ద్వారా పిల్ల‌ల‌ను క‌నాల‌ని ప్ర‌భుత్వం గ‌తంలో ఓ జీవోను పాస్ చేసింది. దాంతో న‌య‌న్ విఘ్నేష్ ల వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా అస‌లు న‌య‌న‌తార ఎవ‌రి ద్వారా స‌రోగ‌సి విధానం లో పిల్ల‌ల‌కు జన్మ‌నిచ్చింది ప్రశ్న‌గా మారింది. కాగా న‌య‌న‌తార కోర్టుకు ఈ విష‌యం పై క్లారిటీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

Nayanatara Vignesh shivan

Nayanatara Vignesh shivan

త‌న‌కు ద‌గ్గ‌రి బంధువు అయిన మ‌హిళ ద్వారానే న‌య‌న్ పిల్లల‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్టు టాక్. విదేశాల్లోని న‌య‌న్ వ్యాపారాల‌ను స‌ద‌రు మ‌హిళ‌నే చూసుకుంటుంద‌ని కూడా స‌మాచారం. అంతే కాకుండా ఆ మహిళ చెన్నై లోని ఓ ఆస్ప్ర‌తిలో క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే న‌య‌న్ రీసెంట్ గా గాడ్ ఫాద‌ర్ సినిమాలో నటించి మెప్పించింది. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది.

Visitors Are Also Reading