ఘట్టమనేని కుటుంబం గురించి అందరికీ తెలుసు. కానీ నవీన్ విజయకృష్ణ ఈ వ్యక్తి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ నరేష్ కొడుకు అంటే మాత్రం తప్పకుండా టక్కున గుర్తుపడతారు. ఇతను కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. కానీ ఇప్పుడు చాలా మారిపోయాడు. ఇతన్ని చూస్తే ప్రస్తుతం ఎవరు గుర్తుపట్టడం లేదు. ఇతను చాలా రోజులకి మీడియా ముందుకు వచ్చాడు. దానికి గల కారణం ఏంటంటే…నరేష్ కొడుకుగా, విజయనిర్మల ముద్దుల మనవడిగా… సినిమాల్లో ఎడిటర్ గా తన కెరీర్ ని ప్రారంభించి హీరోగా మారాడు.
Advertisement
ఇతను రెండు, మూడు సినిమాల్లో నటించాడు. ఇక విజయనిర్మల మరణించడంతో నవీన్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆ కారణంగానే అతను చాలా బరువెక్కాడు. ఈమధ్య మీడియా ముందుకు వచ్చిన నవీన్ తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నాడు. జీవితంలో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యమని చెప్పిన నవీన్ తనని తన నానమ్మ మంచి స్థాయిలో చూడాలని కోరుకునేవారట. తన నానమ్మ తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు. తన నానమ్మ కోసమే నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చానని, జీవితంలో నేను చాలా కోల్పోయానని బాధపడ్డాడు.
Advertisement
నానమ్మ బతికుండగానే తన కోరికను తీర్చలేకపోయానని నటుడిగా ఎదగలేకపోయానని బాధపడ్డారు. ఎక్కడ ఉన్నా మా నానమ్మ ఆశీర్వాదాలు నాకు అందుతాయి. ఆవిడ ఎప్పుడు నా వెంటే ఉంటుంది. జీవితంలో నేను చాలా కోల్పోయాను కొందరి వల్ల అవమానాలు కూడా భరించాను అని చెప్పుకొచ్చాడు. వీటన్నిటి కారణాల వల్లనే డిప్రెషన్ లోకి వెళ్లి దాదాపు మూడు సంవత్సరాలు బయటకి రాలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం అంతా బాగానే ఉంది అందుకే ఇప్పుడు డైరెక్టర్ గా మీ అందరికీ ముందుకు వస్తున్నానని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు…!
Chiranjeevi : భోళా శంకర్ సినిమాకు ఎన్ని కోట్ల నష్టం ఎంతో తెలుసా…?
వరల్డ్ కప్ 2023లో కీపర్ ఎవరు..సంజూకు నిరాశ తప్పదా ?