ఈ రోజుల్లో చాలామంది జుట్టు తెల్లగా అయిపోతోంది అని రంగులు వేసుకుంటున్నారు. జుట్టుని మనం సులభంగా నల్లగా మార్చుకోవచ్చు. అందుకోసం రంగులు కూడా అక్కర్లేదు పూర్వకాలం నుండి పాటించే ఒక పద్ధతిని ఈరోజు మేము మీకోసం తీసుకు వచ్చాము. ఇలా కనుక చేశారంటే జుట్టు నల్లగా మారిపోతుంది. ఆవాల నూనె ఇందుకు చాలా చక్కగా పనిచేస్తుంది. జుట్టుని ఒత్తుగా మారుస్తుంది. నల్లగా పొడుగ్గా కూడా జుట్టు మారిపోతుంది.
Advertisement
Advertisement
ఒక గిన్నెలో ఆవాల నూనె తీసుకుని అందులో కలబంద గుజ్జు, ఒక గుప్పెడు కరివేపాకు, రెండు మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక టీ స్పూన్ కలోంజి గింజలు తీసుకోవాలి. ఇనుప పాత్రలో ఆవాలు నూనె వేసి వేడి చేసి మిగిలిన పదార్థాలు అన్నిటిని కూడా ఇందులో వేసేయాలి. 10 నుండి 15 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత చల్లార్చాలి. నూనె వడకట్టేసి సీసాలో పోసుకోవాలి. జుట్టుకి నూనె అంతటినీ బాగా పట్టించి రెండు గంటల పాటు వదిలేసి తర్వాత తల స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా ఈ నూనెని వారానికి రెండు సార్లు రాసినట్లయితే రంగు అక్కర్లేదు జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.
Also read:
- డ్రాగన్ ఫ్రూట్ తో చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి..!
- మీరు ఆరోగ్యంగానే వున్నారా..? మీ గోళ్లు ఏం చెప్తున్నాయి తెలుసుకోండి..!
- జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాక… ఈ కమెడియన్ల పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా..?