సినీ నటుడు నాజర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకి నాజర్ అంటే అసలు తెలియనివారు అంటూ ఉండరు. ఇతను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, మలయాళంలో కలిపి దాదాపు 600కు పైగా చిత్రాల్లో నటించాడు. ప్రతి ఒక్క సినిమాలో తన నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇతను ఎప్పుడు ప్రేక్షకులను నవ్విస్తూ, నవ్వుతూ ఉంటారు.
కానీ ప్రతి ఒక్క మనిషి చిరునవ్వు వెనక ఏదో ఒక విషాదం తప్పకుండా ఉండే ఉంటుంది. అలాగే నాజర్ చిరునవ్వు వెనక కూడా ఓ విషాదం దాగి ఉంది. నాజర్ భార్య రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటుంది. ఇక వీరికి ముగ్గురు కుమారులు. వీరి మొదటి అబ్బాయి ఫైజల్. చిన్ననాటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఎలాగైనా హీరో అవ్వాలని ఆశతో ఉండేవాడట. ఇక నాజర్ కూడా కొడుకు కోరికను కాదనలేక ఓకే చెప్పాడట. ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయంలో ఫైజల్ 2014లో చాలా పెద్ద ప్రమాదానికి గురయ్యారు. ఇక ప్రమాదంలో తన తల్లిదండ్రులను, ప్రతి ఒక్కరిని మర్చిపోయాడట.
Advertisement
Advertisement
కానీ ఒక్కరిని మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. తన ఫేవరెట్ హీరో విజయ్. విజయ్ సినిమాలు వచ్చిన, తన పాటలు వచ్చిన ఫైజల్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారట. ఈ విషయం తెలిసిన విజయ్ ఓసారి ఫైజల్ పుట్టినరోజుకి ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక హీరో కావాల్సిన తన కొడుకు జీవచచ్ఛవంలా అందరినీ మర్చిపోయి ఉండడంతో నాజర్ తట్టుకోలేకపోతున్నాడట. తల్లిదండ్రులకు ఇంతకుమించి తీరని లోటు అంటూ ఉండదు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని రోడ్డుపై వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని నాజర్ విజ్ఞప్తి చేశాడు.
ఇవి కూడా చదవండి
- Anasuya Bharadwaj : ఆ ప్లేస్ లో సీక్రెట్ టాటూ చూపించిన అనసూయ..!
- టాటూ చూపిస్తూ తిలక్ వర్మ సంబరాలు.. ఎందుకంటే? వీడియో వైరల్
- అప్పుడు తండ్రి… ఇప్పుడు కొడుకు…పాక్ ను భయపెట్టిన నెదర్లాండ్స్ !