ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మార్చి లేదా ఏప్రిల్ మాసంలో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా వైసీపీ పార్టీలో అసంతృప్తి తో ఉన్న… నేతలందరిని… లాగేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ.
ఇక అటు టిడిపి అగ్ర నేత అయిన నారా లోకేష్ ఈసారి కచ్చితంగా గెలవాలని కసితో ఉన్నారు. గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గంలో ఓటమిపాలయ్యారు నారా లోకేష్. అయితే ఈసారి కచ్చితంగా గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే… మంగళగిరిలోని ప్రముఖ దేవాలయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు.
Advertisement
ఆదివారం ఉదయం తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ తో కలిసి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించి చెంచులక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి