Home » Nani : తన భార్యకు తెలియకుండా ఆ అమ్మాయిని సీక్రెట్ లవ్ చేసిన నాని ?

Nani : తన భార్యకు తెలియకుండా ఆ అమ్మాయిని సీక్రెట్ లవ్ చేసిన నాని ?

by Bunty
Ad

నాచురల్ స్టార్ హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పక్కింటి పిల్లాడిలాగా అందరితో చాలా క్లోజ్ గా ఉంటారు. మీడియాతో అయినా, ప్రేక్షకులతో అయినా చాలా సరదాగా మాట్లాడతాడు. నాని తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తన పర్సనల్ విషయాలను కూడా ఎవ్వరు అడిగిన చాలా జెన్యూన్ గా సమాధానం చెబుతాడు. తాజాగా నాని రేడియో ఛానల్లో చిట్ చాట్ నిర్వహించారు.

Advertisement

అందులో పాల్గొన్న నాని తన మొదటి ప్రేమ అనుభవాలను అభిమానులతో పంచుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. తాను మూడవ తరగతిలోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని, కానీ ఆ అమ్మాయిని చూస్తే చాలా సిగ్గు పడేవాడినని చెప్పుకొచ్చాడు. నేను మూడవ తరగతి చదువుతున్న సమయంలో స్కూల్ లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో సోనీ అనే అమ్మాయి మంచి డ్రెస్ వేసుకొని నా పక్కన వచ్చి నిల్చుంది. నేను ఆకులు చుట్టుకొని నిలుచున్నాను. ఆ అమ్మాయిని చూడగానే నాకు మాట్లాడాలని అనిపించింది. కానీ ఆకులు చుట్టుకున్నాను అని చాలా సిగ్గేసి నేను వెళ్లలేకపోయాను.

Advertisement

ఇప్పుడు ఆ అమ్మాయి నాకు కనిపిస్తే వెళ్లి పలకరించాలని ఉంది అని సరదాగా చెప్పుకోచ్చాడు. ఇక ప్రస్తుతం తన క్రష్ ఎవరని అడగగా కియారా అని చెప్పుకొచ్చాడు. ఒకసారి సెట్ లోకి తను చాలా అందంగా తయారయ్యి వచ్చింది. చూడగానే చాలా అందంగా కనిపించింది. ఇక అప్పటి నుంచి నా క్రష్ తనే అని చెప్పుకొచ్చాడు నాని. ఇక నాని నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ మృనాల్ ఠాకూర్, నాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో బేబీ కియారా కన్నా కీలక పాత్ర పోషించనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాని డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు నాని.

 

 

 

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading