Ad
టాలీవుడ్ లో ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒక్కరు. అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనా నాని ఆ తర్వాత సూపర్ హిట్ సినిమాలు చాలానే చేసాడు. వరుసగా సినిమాలు తీసిన నాని ఇండస్ట్రీలో అతి కష్టమైన డబల్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస ప్లాప్స్ చూసాడు నాని. దాంతో కొంచెం డీలా పడిన ఈ మధ్య శ్యామ్ సింగారి సినిమాతో మళ్ళీ ట్రాక్ లో వచ్చి బ్రేక్ ఇవ్వకుండా ఇప్పుడు అంటే సుందరానికి! అనే సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు.
అయితే ఈ సినిమా విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్ లో భాగంగా నాని మాట్లాడుతూ హన పెళ్లి సమయంలో ఓ సంఘటన గురించి చెప్పాడు. అయితే పెళ్లి సమయానికి నాని అప్పుడే హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా ఆ స్ట్రగుల్స్ నుండి బయటకి రాలేదు. దాంతో ఈ విషయం తెలిసిన నాని భార్య అయిన అంజనా యలవర్తి అమ్మ నాన్నను అప్పుడు నానితో పెళ్లి అంటే కొంచెం భయపడరట. అలాగే సినిమా వాడు కావడంతో అమ్మాయిని ఇవ్వడానికి కొంచెం ఆలోచించటారట.
కానీ ఆ తర్వాత నానినే ద్వయంగా వెళ్లి వారితో మాట్లాడిన తర్వాత పెళ్లి చేయడానికి వెంటనే ఒపుకున్నట్లు తెలిపాడు. అయితే ఇప్పుడు నాని – అంజనా దంపతులకు ఓ కొడుకు కూడా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటె అంటే సుందరానికి అనే సినిమాతో నాని మరో హిట్ అందుకున్నాడు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు నాని దసరా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది దసరా సమయానికి అభిమానుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది.
ఇవి కూడా చదవండి :
మ్యాచ్ కు 100 కోట్లు… ఐపీఎల్ మీడియా రైట్స్ దూకుడు..!
మిథాలీ ఆ క్రికెటర్ పై ప్రేమతోనే పెళ్లి చేసుకోలేదా..?
Advertisement