Home » మ్యాచ్ కు 100 కోట్లు… ఐపీఎల్ మీడియా రైట్స్ దూకుడు..!

మ్యాచ్ కు 100 కోట్లు… ఐపీఎల్ మీడియా రైట్స్ దూకుడు..!

by Azhar
Ad

ఐపీఎల్ యొక్క 2023 – 2027 కు సంబంధించిన మీడియా రైట్స్ యొక్క వేలం ఈరోజు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేలం నుండి బీసీసీఐ కనీసం 50 వేళా కోట్లు అయిన తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటుంది. అయితే 2008 లో ప్రారంభమైన ఈ ఐపీఎల్ అనేది ఈ ఏడాదితో 15 సీజన్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. సీజన్ సీజన్ కు ఐపీఎల్ క్రేజ్ అనేది పెరుగుతూ వచ్చింది తప్ప ఎప్పుడు తగ్గలేదు. ఇక గత 5 ఐపీఎల్ సీజన్స్ యొక్క రైట్స్ ను స్టార్ స్పోర్ట్స్ సంస్థ 16 వేల కోట్ల కంటే ఎక్కువ ధరకే కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాదితో ఆ గడువు ముగిసింది.

Advertisement

దాంతో ఇప్పుడు మళ్ళీ మీడియా రైట్స్ యొక్క వేలం అనేది నిర్వహిస్తుంది బీసీసీఐ. ఇందు కోసం బేస్ ప్రైజ్ గా 32 వేల కోట్లను ఉంచింది బీసీసీఐ. అంటే టీవీలో వచ్చే ఒక్కో మ్యాచ్ కు 49 కోట్లను బేస్ ప్రైజ్ గా నిర్ణయించగా.. ఇక డిజిటల్ లో 33 కోట్లుగా ఉంచింది. కానీ ఈరోజు జరుగుతున్న ఈ ఐపీఎల్ మీడియా రైట్స్ వేలంలో అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ఐపీఎల్ లో ఒక్కో మ్యాచ్ విలువ 100 కోట్లు దాటిపోయింది అని తెలుస్తుంది. ఒకవేళ ఈ వేలం అనేది ఈరోజు ముగియకపోతే దీనిని మళ్ళీ రేపు కొనసాగిస్తోంది బీసీసీఐ.

Advertisement

అయితే ఆన్లైన్ లో నిర్వహిస్తున్న ఈ ఇ-వేలంలో ఐపీఎల్ రైట్స్ విలువ అంతకంతకు పెరుగుతూనే పోతుంది. దీని ప్రకారం మన చూసినట్లయితే బీసీసీఐ అనుకున్న 50 వేల కోట్ల టార్గెట్ అనేది పెద్ద విషయమే కాదు. ఒకవేళ ఈ వేల రేపు కూడా కొనసాగితే 60 వేల కోట్లు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఈ ఏడాది రేడు కొత్త జట్లు రావడంతో మ్యాచ్ ల సంఖ్యను పెంచిన బీసీసీఐ వాటిని వచ్చే సీజన్ లలో మరింత పెంచనున్నట్లు తెలుస్తుంది. అందుకే రైట్స్ కోసం ఇంత ఎక్కువగా పోటీ ఉన్నట్లు అర్ధం అవుతుంది చూడాలి మరి ఇది ఏకాకి వెళ్లి ఆగుతుంది అనేది.

ఇవి కూడా చదవండి :

పాండ్య ఆ పరుగు తీయకపోవడానికి అదే కారణమా..?

ఈపీఎల్ కంటే మన ఐపీఎల్ బెస్ట్ అంటున్న గంగూలీ..!

Visitors Are Also Reading