తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి పెద్దగా ఏలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి… మొదట సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి… ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకొని ఒక్కో విజయంతో మెట్టు మెట్టు పైకి ఎక్కుతూ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే నాని ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో మూవీలలో హీరోగా నటించాడు. అందులో భాగంగా నాని ఆఖరుగా నటించిన 5 మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేశాయో తెలుసుకుందాం.
Advertisement
నాని తాజాగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 63.55 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. నాని కెరియర్లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి నాని కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ గా దసరా నిలిచింది.
Advertisement
నాని హీరోగా రూపొందిన అంటే సుందరానికి మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసేసరికి 21.35 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటించింది.
నాని హీరోగా రాహుల్ సంకృతీయన్ దర్శకత్వంలో రూపొందిన శ్యామ్ సింగరాయ్ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 26.50 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీలో సాయి పల్లవి , కృతి శెట్టి హీరోయిన్లుగా నటించగా… మడోనా సభాష్టియన్ కీలక పాత్రలో నటించింది.
నాని హీరోగా రూపొందినటువంటి గ్యాంగ్ లీడర్ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 23.40 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది.
నాని హీరోగా రూపొందిన జెర్సీ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 32.03 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించింది.