టాలీవుడ్ యంగ్ హీరో ఆదీతో హీరోయిన్ నిక్కీ గల్రానీ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మరకతమణి అనే సినిమాలో హీరో హీరోయిన్ లుగా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఆ తరావాత ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఆది అటు కోలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఇటు టాలీవుడ్ లో కూడా హీరోగా విలన్ గా సినిమాలు చేశారు.
Advertisement
అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాలో ఆది విలన్ గా నటించగా ఆయన నటను ప్రశంసలు అందాయి. ఆ తరవాత విలన్ ఎన్నో అవకాశాలు వచ్చినా ఆది వాటికి ఒప్పుకోలేదు. ఇక తాజాగా ఆది తాను ప్రేమించిన హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరి ఎంగేజ్మెంట్ ఇరువురి కుటుంబ సభ్యుల మధ్యలో జరిగింది. త్వరలోనే వీరిద్దరి వివాహం కూడా జరగనుంది.
Advertisement
అయితే ఎంగేజ్మెంట్ రీసెంట్ గా జరిగింది కానీ నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకోవాలని నాని మరకతమణి సినిమా ఈవెంట్ లోనే ఆదికి చెప్పడం ఆశ్చర్యకరం. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో నాని మాట్లాడుతూ..ఎవరిలో చూడని ఓ క్వాలిటీని ఆదిలో చూసానని అన్నారు.
అల్లరోడు అనుకునేవాడినని కానీ ఆదిలో ఇంకో సైడ్ కూడా ఉందని అన్నారు. కానీ అదేంటో చెప్పకుండా సిగ్గుపడ్డాడు. అంతే కాకుండా అందరూ ఆది పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారని…నిక్కీని పెళ్లి చేసుకోవచ్చుగా బాగానే ఉందిగా అంటూ కామెంట్ చేశాడు. దానికి ఆది సైలెంట్ గా ఉండిపోయాడు. స్టేజిపై ఉన్నవాళ్లు నవ్వేశారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో వీరిద్దరి ప్రేమ గురించి నానికి ముందుగానే తెలుసని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.
https://fb.watch/c2qEEdrKsz/