Home » నందమూరి నటలకు హిట్లు… మెగా హీరోలకు ఫ్లాప్ లు… ఇచ్చిన స్టార్ డైరెక్టర్లు వీరే..!

నందమూరి నటలకు హిట్లు… మెగా హీరోలకు ఫ్లాప్ లు… ఇచ్చిన స్టార్ డైరెక్టర్లు వీరే..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యామిలీలలో ముందు వరుసలో ఉండే కుటుంబాలు నందమూరి ఫ్యామిలీ… మెగా ఫ్యామిలీ. ఈ రెండు కుటుంబాల నుండి ప్రస్తుతం ఎంతోమంది స్టార్ హీరోలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

Advertisement

ఇది ఇలా ఉంటే ఈ ఫ్యామిలీ లలో ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు కూడా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ రెండు ఫ్యామిలీలో ఉన్న స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి అందులో కొంతమందితో హిట్లు మరి కొంతమందితో ఫ్లాప్ లను అందుకున్న దర్శకులు కొంతమంది ఉన్నారు. వారు ఎవరో తెలుసుకుందాం.

Advertisement

బోయపాటి శ్రీను : ఈ దర్శకుడు ఇప్పటివరకు ఇటు నందమూరి ఫ్యామిలీ హీరోలతోనూ… అటు మెగా ఫ్యామిలీ హీరోలతోనూ సినిమాలను తెరకెక్కించాడు. అందులో భాగంగా ఈ దర్శకుడు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందినటువంటి సింహ, లెజెండ్, అఖండ 3 మూవీలకు దర్శకత్వం వహించి మూడు మూవీలతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు మెగా హీరో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం అందుకుంది. ఇక ఈ దర్శకుడు మెగా హీరో అయినటువంటి అల్లు అర్జున్ టి సరైనోడు అనే బ్లాక్ బాస్టర్ మూవీ ని తెరకెక్కించగా… నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము అనే ప్లాప్ మూవీ ని తెరకెక్కించాడు.

కొరటాల శివ : టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి ఈ దర్శకుడు నందమూరి కుటుంబంలో స్టార్ హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇదే దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించాడు.

Visitors Are Also Reading