బాలకృష్ణ మాస్ హీరో. సినిమా రంగంలో తిరుగులేని తారగా వెలుగుతున్నారు. రీసెంట్‌గా నటించిన అఖండ సినిమా అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా రంగంలోనే కాకుండా బాలయ్య రాజకీయ రంగంలో కూడా చక్రం తిప్పుతున్నారు. నందమూరి తారక రామారావు తనయుడిగా ఆయన సినీరంగ ప్రవేశం చేసి సుమూరు 30 ఏళ్ల నుంచి సినిమా రంగంలో ఉన్నారు.
తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో కూడా బాలయ్య సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మన అభిమాన హీరోలకు ఎన్ని రకాల ఆస్తులు ఉన్నాయి. వాటి విలువెంత? ఎక్కడెక్కడ ఉన్నాయి. అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. దానికోసం ప్రయత్నాలు చేస్తుంటారు. బాలకృష్ణ అభిమానులు కూడా ఆయన ఆస్తుల గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. బాలయ్య ఆస్తుల విషయానికి వస్తే హైదరాబాద్‌లో 30 కోట్ల రూపాయల విలువ చేస్తే బంగ్లా ఉన్నది. కోటికిపైగా విలువ చేసే కారు ఉంది. బాలయ్య వద్ద 400 గ్రాముల బంగారం, 5కిలోల వెండి ఉండగా, ఆయన భార్య వద్ద 3487 గ్రాముల బంగారం, 300 క్యారెట్ల వజ్రాలు, 31 కిలోల వెండి ఉన్నాయట. బాలయ్య ఆస్తి మొత్తం రూ.325.47 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. బాలయ్య భార్య కొడుకు పేరుమీద షేర్లు కూడా ఉన్నాయట.