Home » ఆడపిల్లలకి ఈ 6 అక్షరాలతో పేర్లు పెడితే.. వారికి బాగా కలిసి వస్తుందట.. అవేంటో తెలుసుకోండి!

ఆడపిల్లలకి ఈ 6 అక్షరాలతో పేర్లు పెడితే.. వారికి బాగా కలిసి వస్తుందట.. అవేంటో తెలుసుకోండి!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

సాధారణంగా పిల్లలు పుట్టిన తరువాత వారికి ఏమి పేరు పెట్టాలా? ఎలాంటి పేరు పెట్టాలా? అని పేరెంట్స్ తర్జన భర్జన పడిపోతూ ఉంటారు. అందులోను ఆడపిల్లలకు పేర్లు పెట్టాలంటే సవాలక్ష ఆలోచిస్తుంటారు. ఆడపిల్లని ఇంటి మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు.

Advertisement

ఆడపిల్ల పుడితే.. ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అయితే వారికి మంచి పేరు పెడితే.. అది మరింత అదృష్టాన్ని తీసుకొస్తుంది. నిజానికి చాలా మంది పేర్లు పెట్టడం కోసం.. సంఖ్యా శాస్త్రాన్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశీలించి ఏ పేరు పెడితే బాగుంటుందో చూసి ఆ పేరు పెడుతూ ఉంటారు. నిజానికి ఇది మంచి విషయమే.

అయితే… ఆడపిల్లలకు పేర్లు పెట్టాలంటే.. ఓ ఆరు అక్షరాలతో ఏదైనా ఒకదానితో మొదలయ్యేలా పెడితే.. వారిపై లక్ష్మి దేవి అనుగ్రహం ఉండి, వారి జీవితం ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్లిపోతుందట. ఈ అక్షరాలతో ఇంట్లోని ఆడపిల్లలకు పేర్లు పెడితే.. వారి ఇంట్లో అమ్మవారు నడిచొస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఈ ఆరు అక్షరాలా పేర్లు చాల శక్తివంతమైనవట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

అ అక్షరంతో అమ్మాయిలకు పేర్లు పెడితే.. వారికి అదృష్టం కలిసి వస్తుందట. వారికి మంచి నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయట. ఇ అక్షరంతో అమ్మాయిలకు పేర్లు పెడితే వారు చాలా ధైర్యవంతులుగా ఉంటారట. అలాగే.. వారి చుట్టూ ఉండేవారికి కూడా అదృష్టం వరిస్తుంది. ఔ అక్షరంతో మొదలయ్యే పేరుని అమ్మాయిలకి పెడితే వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందట. ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారట. ఏ అక్షరంతో మొదలయ్యే పేరు పెడితే.. వారిని అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వారి ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. ఏ పనిని అయిన పట్టు వదలకుండా పూర్తి చేస్తారట. సి అక్షరంతో మొదలయ్యే పేరు పెడితే.. వారు చాలా నిజాయితీగా ఉంటారట. అలాగే ఎల్ అక్షరంతో పేరు పెట్టినా… వారు జీవితంలో కష్టపడి మంచి స్థానాన్ని పొందుతారట. డబ్బు విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా ఉంటారట.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading