Home » న‌గ్మాతో సౌర‌వ్ ప్రేమాయ‌ణం..భార్య హ‌ర్ట్ అవ్వ‌డంతో సీన్ రివ‌ర్స్..!

న‌గ్మాతో సౌర‌వ్ ప్రేమాయ‌ణం..భార్య హ‌ర్ట్ అవ్వ‌డంతో సీన్ రివ‌ర్స్..!

by AJAY
Ad

క్రికెట‌ర్లు సినిమా హీరోయిన్ ల‌ను అయ‌స్కాంతంలా ఆక‌ర్షిస్తారేమో. ఎందుకంటే ప్ర‌తి జ‌ట్టులోనూ సినిమా తార‌ల‌తో ప్రేమాయ‌ణం న‌డిపే క్రికెట‌ర్లు వారిని పెళ్లాడే క్రికెట‌ర్లు క‌నిపిస్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ కూడా ఓ హీరోయిన్ న‌గ్మ‌తో ప్రేమాయ‌ణం న‌డిపించార‌న్న‌ది ఓపెన్ సీక్రెట్. అయితే వారి ప్రేమ మాత్రం పెళ్లీ పీట‌ల వ‌ర‌కూ చేర‌లేదు. ఇక సౌర‌వ్ పెళ్లి చేసుకుని కుటుంబంతో క‌లిసి ఉండ‌గా ఆ హీరోయిన్ న‌గ్మ మాత్రం ఇప్ప‌టికీ ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతోంది. ఇంత‌కీ వారి ప్రేమ‌కు పెళ్లికి ఎవ‌రు అడ్డువ‌చ్చారు.

Nagma sourav Ganguly love story

Nagma sourav Ganguly love story

ఎందుకు ఇద్ద‌రూ విడిపోవాల్సివ‌చ్చింది అన్న‌ది తెలియాలంటే ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే…1999 వ‌రల్డ్ క‌ప్ రోజుల్లో ఓ మిత్రుడి ద్వారా సౌర‌వ్ కు న‌గ్మ ప‌రిచ‌మైంద‌ట‌. ఆ త‌ర‌వాత వీరి పరిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింద‌ట‌. న‌గ్మ‌లో ఉండే చ‌లాకీత‌నం..లౌక్యం తెలియ‌ని ఆమె ప్ర‌వ‌ర్త‌న గంగూలీకి తెగ‌న‌చ్చేశాయ‌ట‌. అంతే కాకుండా సౌర‌వ్ టీం ఇండియా కెప్టెన్ అయిన‌ప్ప‌టికీ గ‌ర్వం లేకుండా చాలా సింపుల్ గా ఉండ‌టం. త‌నతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వ‌డంతో న‌గ్మ కూడా సౌర‌వ్ కు ప‌డిపోయింద‌ట‌. దాంతో అప్ప‌ట్లో ఈ జంట చెట్టాప‌ట్టేలుసుకుని తిరిగేశారు. అయితే ఈ క్ర‌మంలో సౌర‌వ్ ప్రేమ‌లో ప‌డి ఆట‌ను ప‌క్క‌న పెట్టేశాడు అని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చిన రోజులు ఉన్నాయి. అంతే కాకుండా ఇప్పుడు విరాట్ ఆట‌తీరు న‌చ్చ‌క‌పోతే అనుష్క శ‌ర్మ పై ఎలా విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారో అదే విధంగా సౌర‌వ్ స‌రిగ్గా ఆడ‌క‌పోతే క్రికెట్ అభిమానులు న‌గ్మ‌పై నోరు పారేసుకునేవార‌ట‌.

Advertisement

Advertisement

అంతే కాకుండా వ‌ర‌ల్డ్ క‌ప్ చేజారిపోవ‌డానికి కూడా సౌర‌వ్ ఏకాగ్ర‌త లోపమే కార‌ణ‌మ‌ని….అందుకు నగ్మ‌నే కార‌ణం అని కూడా అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే అలాంటి ట్రోల్స్ ను న‌గ్మ లైట్ తీసుకుంది. కానీ అప్ప‌టికే సౌర‌వ్ ను పెళ్లి చేసుకున్న డోనా త‌న భ‌ర్త‌ న‌గ్మ‌తో లవ్ లో ఉన్నాడంటూ అంటూ వార్త‌లు రావ‌డం ఇద్ద‌రూ క‌లిసి తిరుమ‌ల‌లో దిగిన‌ ఫోటోలు క‌నిపించ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయింద‌ట‌. దాంతో సౌర‌వ్ తో గొడ‌వ‌కు దిగ‌టం మొద‌లు పెట్టింద‌ట‌.

అంతే కాకుండా మీడీయా ముందుకు వ‌చ్చి అలాంటిది ఏమీ లేదు అని చెప్పాల‌ని సౌర‌వ్ ను ప‌ట్టుప‌ట్టింద‌ట‌. సౌర‌వ్ త‌న చిన్న‌నాటి స్నేహితురాలు అయిన డోనాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని కూడా రెండేళ్లే అయింది. ఇక డోనా పై కూడా సౌర‌వ్ కు అమిత‌మైన ప్రేమ ఉండ‌టంతో ఆమె చెప్పిన‌ట్టే చెప్పేశాడు. మరోవైపు డోనా కూడా న‌గ్మ సౌర‌వ్ పై వ‌స్తున్న వార్త‌ల‌ను మీడియా ముఖంగా ఖండించింది. ఆ త‌ర‌వాత న‌గ్మ హ‌ర్ట్ అయ్యింది. తాను సౌర‌వ్ జీవితం నుండి వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకుంది. అప్ప‌టినుండి న‌గ్మ అత‌డికి దూరంగా త‌న దారి తాను చూసుకుంది.

Visitors Are Also Reading