Home » Srileela : శ్రీలీల గురించి నాగ సౌర్య చెప్పిన ఈ మాటలు వింటే హ్యాట్సాఫ్ అంటారు..!

Srileela : శ్రీలీల గురించి నాగ సౌర్య చెప్పిన ఈ మాటలు వింటే హ్యాట్సాఫ్ అంటారు..!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ల స్థాయికి చేరింది శ్రీలీలా. ఈమె ధమాకా సినిమా తర్వాత ఎదురులేని హీరోయిన్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాలు ఒప్పుకుంది. అయితే తాజాగా ఈ అమ్మడు అంతర్జాతీయ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈమె చెన్నై స్టోరీ అని ఇంగ్లీష్ సినిమాలో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది.

Advertisement

మరో ఏడాది వరకు ఆమె డేట్స్ దొరికే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఏడు సినిమాలు ఉన్నాయి. దాదాపు అందరు టాలీవుడ్ బడా హీరోల సరసన శ్రీలీల నటిస్తోంది. నిజానికి శ్రీలీల నాగసౌర్య “ఛలో” సినిమా ద్వారానే పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఆ సినిమాతో కుదరలేదు. ఈ విషయం గురించే నాగ సౌర్యతో ప్రస్తావించడంతో నాగసౌర్య ఆమె గురించి చెప్పుకొచ్చారు. ఛలోతో పరిచయం అవ్వాల్సి ఉందని, కానీ కుదరలేదని చెప్పారు. ఆమె గురించి ఓ సీక్రెట్ చెప్తానని.. ఇప్పటివరకు అది శ్రీలీలకు కూడా తెలియదని చెప్పారు.

Advertisement

ఓసారి నేను బెంగుళూరు నుంచి ఫ్లైట్ లో వస్తున్నానని, అదే ఫ్లైట్ లో శ్రీలీల కూడా ఉందని అన్నారు. ఆ సమయంలో ఒక వృద్ధురాలు కూడా ఫ్లైట్ ఎక్కారు. ఆమె సీట్ నెంబర్ చాలా చివరిలో ఉంది. ఆమె అంతవరకు వెళ్ళడానికి కష్టపడుతుంటే.. శ్రీలీల లేచి ఆమె సీట్ నెంబర్ అడిగి తన సీట్ ఆమెకు ఇచ్చేసి వెనక్కి వెళ్ళిపోయి కూర్చున్నారు. చాలా గ్రేట్ అని అనిపించింది. ఏ స్టార్ హీరోయిన్ కూడా అలాంటి పని చేయరు” అంటూ శ్రీలీలను తెగ పొగిడేశారు. ఆమెకు అంత మంచి మనసు ఉంది కాబట్టే ఈరోజు ఈ రేంజ్ లో ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

రాత్రిపూట మృతదేహాన్ని ఒంటరిగా ఉంచకూడదు ఎందుకో తెలుసా..?

అధికమాస అమావాస్య నాడు ఈ తప్పులు ఎట్టి పరిస్థితిలో చేయకండి..! శివుని ఆగ్రహానికి లోనవుతారు..!

Chanikya niti : విజయవంతమైన వ్యాపారవేత్త కావాలంటే ఈ లక్షణాలు మీలో కచ్చితంగా ఉండాలి..!

Visitors Are Also Reading