Home » ప్రేమంటే ఇదేరా..? అమ‌ల చెప్పింద‌ని ఇప్ప‌టికీ ఆ పనిచేస్తున్న నాగార్జున‌..? ఆ ప‌నేంటంటే..!

ప్రేమంటే ఇదేరా..? అమ‌ల చెప్పింద‌ని ఇప్ప‌టికీ ఆ పనిచేస్తున్న నాగార్జున‌..? ఆ ప‌నేంటంటే..!

by AJAY
Ad

ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా మంది సెలబ్రెటీలు కొంత‌కాలం మాత్ర‌మే క‌లిసి ఉండ‌టం చూస్తూనే ఉంటాం. కానీ నాగార్జున అమ‌ల‌లు మాత్రం పెళ్లి నాటి నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి వివాదాలు లేకుండా చాలా మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. నాగార్జున మొద‌టి భార్య ల‌క్ష్మితో విడాకుల అనంత‌రం అమ‌ల‌ను రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి సినిమాల్లో న‌టిస్తున్న స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డ్డారు. తాము ప్రేమించికుంటున్న విష‌యం ఏఎన్ఆర్ కు చెప్పి నాగార్జున అమ‌లను వివాహం చేసుకున్నారు.

Advertisement

పెళ్లి త‌ర‌వాత వీరిద్ద‌రికీ అఖిల్ జ‌న్మించాడు. ఇక అఖిల్ తో పాటూ అమ‌ల నాగ‌చైత‌న్య‌ను కూడా త‌న సొంత కొడుకులానే చూసుకుంటారు. ఇక నాగార్జున తో పెళ్లి త‌ర‌వాత అమ‌ల సినిమాల‌కు కూడా గుడ్ బై చెప్పారు. భ‌ర్త మ‌రియు కుటుంబాన్ని చూసుకుంటూ కొన్ని సేవా సంస్థ‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తున్నారు. త‌న‌కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ‌ల అంటే కూడా నాగార్జున‌కు చాలా ఇష్టం.

Advertisement

ఇదిలా ఉంటే నాగార్జున‌ను ఎంతో ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్న అమ‌ల పెళ్లికి ముందు ఆయ‌న‌కు ఓ మాట చెప్పింద‌ట‌. అంతే కాకుండా ఇచ్చిన మాట క‌చ్చితంగా నిల‌బెట్టుకోవాల‌ని ప్రామిస్ తీసుకుంద‌ట‌. ఇక నాగార్జున పెళ్లి త‌ర‌వాత కూడా అమ‌ల చెప్పిన ఆ ప‌నిని క‌చ్చితంగా చేస్తున్నార‌ట‌. ఆ ప‌ని మ‌రేదో కాదు. అమ‌లకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఆమె బ్లూ క్రాస్ తో క‌లిసి పనిచేస్తున్నారు.

తాను జంతువుల సంపాద‌న కోసం కొంత ఖ‌ర్చుపెడ‌తాన‌ని చెప్పింద‌ట‌. నాగార్జున కు కూడా త‌న సంపాద‌న నుండి కొంత జంతువుల సంర‌క్ష‌ణ కోసం ఖ‌ర్చు చేయాల‌ని కోరింద‌ట‌. ఇక అమ‌ల కోరికమేర‌కు నాగ్ ఇప్ప‌టికీ జంతువుల సంర‌క్ష‌ణ కోసం ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌. అంతే కాకుండా అమ‌ల ఇంట్లో కూడా కొన్ని జంతువుల‌ను ప్రేమ‌తో పెంచుకుంటున్నారు.

Visitors Are Also Reading