Home » ఆ సినిమా నాగార్జున చేయాల్సింది… అలా మిస్ అయింది..!

ఆ సినిమా నాగార్జున చేయాల్సింది… అలా మిస్ అయింది..!

by AJAY
Ad

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన మూవీలలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ను సంపాదించుకున్నాడు. అలాగే శివ మూవీతోనే నాగ్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే ఇప్పటికే నాగ్ ఎన్నో బహుభాషా చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

Advertisement

అలాగే ఇతర భాష దర్శకులతో కూడా నాగ్ పనిచేశాడు. ఇది ఇలా ఉంటే నాగార్జున కొడుకు నాగచైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి తమిళ దర్శకుడు అయినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈరోజు అనగా మే 12వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల చేశారు.

Advertisement

ఈ మూవీ దర్శకుడు ఈ సినిమా విడుదల సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా వెంకట్ ప్రభు మాట్లాడుతూ … నేను నేరుగా తెలుగులో ఒక సినిమా చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను. కానీ మూవీ సెట్ అవడం లేదు. అజిత్ గారితో నేను రూపొందించిన “మన్కాతా” మూవీని తెలుగులో సమాంతరంగా నాగార్జునతో తీయాలి అని అనుకున్నాను.

అందుకోసం అని నాగార్జునతో సంప్రదింపులు కూడా జరిపాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కూడా లేదు. అలాగే మానాడు మూవీ ని కూడా సమాంతరంగా తెలుగులో వేరే హీరోతో చేయాలి అనుకున్నాను… అది కూడా వీలు కాలేదు అని ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading