అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపు సంపాదించుకున్నాడు. తన నటనతో మన్మధుడిగా పేరొందాడు. తన నటన, అందానికి ఒకప్పటి హీరోయిన్లు, అమ్మాయిలు క్యూ కట్టేవారు. ఎలాంటి సినిమాల్లో అయినా, ఎటువంటి పాత్రలో అయినా చక్కగా ఒదిగిపోయి ఆ పాత్రకు న్యాయం చేసేవాడు నాగార్జున. ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించి కొన్ని కోట్ల ఆస్తులను సంపాదించుకున్నారు.
అన్నపూర్ణ స్టూడియోలో పలు సినిమాలను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా టీవీ షోలు, యాడ్స్ రూపంలో బాగానే ఆస్తులను సంపాదిస్తున్నారు. అంతేకాకుండా నాగార్జున హోస్ట్ గా కూడా వ్యవహరిస్తు ఎక్కువ మొత్తంలో పారితోషికాన్ని అందుకుంటున్నారు. ఇక నాగార్జునకి హైదరాబాదులో పలు పరిసర ప్రాంతాల్లో భవనాలు, ఖరీదైన భూములు ఉన్నట్లు సమాచారం. నాగార్జున మొదటగా మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఇప్పటివరకు బిగ్ బాస్ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్నారు.
Advertisement
Advertisement
అంతేకాకుండా 50 పదుల వయసు వచ్చినప్పటికీ ఇంకా సినిమాల్లో హీరోగా నటిస్తూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. సినిమాల్లో నటించినందుకు కూడా నాగార్జున భారీగానే రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడు. అంతేకాకుండా నాగార్జున వద్ద ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక మొత్తంగా నాగార్జున ఆస్తి విలువ సుమారు 3వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక నాగార్జున కుమారులు కూడా సినిమాల ద్వారా బాగానే ఆస్తులను కూడబెడుతున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!