అలనాటి సీనియర్ నటుడు, మాజీ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా రాణించడమే కాకుండా తెలుగుదేశం పార్టీని స్థాపించి అద్భుతం సృష్టించారు నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు నందమూరి తారకరామారావు. అయితే నందమూరి తారక రామారావు కు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని… ఆయనను మోసం చేసి మరి చంద్రబాబు అధికారంలో లాక్కున్నాడని ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉంది.
Advertisement
అయితే ఈ విషయంపై తాజాగా తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నందమూరి తారక రామారావు కు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారన్నది వాస్తవమని చెప్పుకొచ్చారు. నందమూరి తారక రామారావును లక్ష్మీపార్వతి పెళ్లి చేసుకున్న తర్వాత… ఆమె ఆధిపత్యం కుటుంబంతో పాటు తెలుగుదేశం పార్టీలో కూడా కొనసాగిందన్నారు నాగం జనార్దన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా సీనియర్ ఎన్టీఆర్ ఉన్న సమయంలో… పార్టీలో అలాగే ప్రభుత్వంలో అన్ని నిర్ణయాలు లక్ష్మీపార్వతి అమలు చేసేలా.. ఆమె పరిస్థితిని తీసుకొచ్చిందన్నారు.
Advertisement
అటెండర్ పోస్టు భర్తీ చేయాలన్న లక్ష్మీపార్వతి పర్మిషన్ ఇవ్వాల్సిందేనన్న పరిస్థితి వచ్చిందని నాగం తెలిపారు. మంత్రి పదవులు ఇవ్వాలన్న… చిన్న పదవి కావాలన్నా లక్ష్మీపార్వతి ఆదిపత్యం అందులో పెరిగిపోయిందన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ నేతలు కలవకుండా ఆమె దారుణంగా వ్యవహరించిందని తెలిపారు. దీంతో పార్టీ నష్టపోతుందని… చంద్రబాబుతో అందరం కలిసి కూటమిపెట్టినట్లు చెప్పుకొచ్చారు నాగం జనార్దన్ రెడ్డి. ఇందులో వెన్నుపోటు పొడిచారన్న వార్తలు అవాస్తవమని కుండబద్దలు కొట్టి చెప్పారు.
ఇవి కూడా చదవండి
చిరంజీవికి “మెగాస్టార్” అనే బిరుదుని ఇచ్చింది ఎవరో తెలుసా?
కూతురు పుట్టిన సంతోషంలో 300 కోట్లు రాసిచ్చిన ఉపాసన!
బీరువాలో వీటిని పెట్టడం వల్ల అప్పులు తీరుతాయి…ఆదాయం వస్తుంది!